1. 8 ఇయర్స్ తరువాత ఆ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.?ఫాన్స్ కి పండగే.!  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఇప్పటికే 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటుగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని టాక్.గబ్బర్ సింగ్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ ని పోలీస్ పాత్రలో విలక్షణంగా చూపించడానికి హరీష్ ప్లాన్ చేస్తున్నాడు అంట.  

అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి ఈ సినిమా హరీష్ శంకర్ తీసిన మిరపకాయ్ 2 లా ఉంటుందని అంటున్నారు. అన్నట్టు అందులో కూడా హీరో పోలిస్ ఆఫీసర్.మిరపకాయ్ స్టొరీ అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసమే రాసిన హరీష్ శంకర్ ఇప్పుడా ఆ స్టొరీని మరోలా మార్చి పవన్ కళ్యాణ్ ని అభిమానులు మెచ్చేలా రాసాడు అని సమచారం.

బాలయ్య దెబ్బకు oTT సలాం..!

2.రాజమౌళి సిద్ధం అయ్యాడు..ఫస్ట్ ఎవరు అంటే..?  

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో RRR సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలుగా ఆగిపోయిన విషయం తెల్సిందే.      

నెల చివర్లో సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నాడట. తక్కువ మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో RRR షూటింగ్ కు వెళ్లేందుకు రాజమౌళి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంతో పోల్చితే ఇప్పుడు కరోనా గురించిన కొత్త భయం తగ్గడంతో మళ్ళీ   రాజమౌళి అండ్ టీం షూట్ కు సిద్దం అవుతున్నారు.

ఈ షూటింగ్ లో మొదట ఎన్టీఆర్ మాత్రమే పాల్గొనబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.మరోపక్క రామ్ చరణ్ నిర్మిస్తున్న'ఆచార్య' సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దాదాపు నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాత RRR షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అవ్వబోతున్నాడు అని సమచారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

3.రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్..?ఒకే అయితే ఫాన్స్ కి పండగే.!  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 లో వచ్చిన అరవింద సమేత వీర రఘువ సినిమా బిగ్గెస్ట్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని s.s. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలు సినిమా షూటింగ్ అగ్గిపోయింది.  

మళ్ళీ ఇప్పుడు రాజమౌళి RRR షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు అని టాక్.ఫస్ట్ ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలుపెట్టాలి అని రాజమౌళి ప్లన్ చేస్తున్నాడు.అంటూ ఎన్టీఆర్ తన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ మూవీని చేయాల్సి ఉంది. అందుకే రామ్ చరణ్ రాకముందే తన పార్ట్ ను పూర్తి చేయాలని రాజమౌళిని కోరాడట ఎన్టీఆర్.

రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం.అంటూ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.RRR సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకే త్రివిక్రమ్ మూవీని వెంటనే చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు అంట.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

4.మెగాస్టార్ సినిమాని జక్కన్నలా చెక్కుతున్న సుకుమార్..!  

ఖైదీ నంబర్ 150 సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత సైరా తో మెప్పించినా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి పెట్టిన బడ్జెట్ రేంజ్ లో అయితే వసూళ్లు అందుకోలేక పొయ్యాడు.దాంతో అక్కడ తగ్గిన కలెక్షన్స్ కూడా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య తో రాబట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్.

ఈ సినిమా తర్వాత ముందు లూసిఫర్ రీమేక్ అనుకున్నా ఇప్పుడు వేదాలం రీమేక్ కి సై అన్న విషయం తెలిసిందే. కాగ ఈ రీమేక్ ని ఎప్పుడో 2013 లో చివరి సారి డైరెక్షన్ చేసిన మెహర్ రమేష్ కి అప్పగించిన మెగాస్టార్ మెహర్ పై నమ్మకం పెట్టినా కానీ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చేర్పులు తనవరకు బాగా నచ్చగా 3rd పర్సన్ ఒపీనియన్ తీసుకోవాలని మరోసారి  డైరెక్టర్ సుకుమార్ కి స్క్రిప్ట్ ని పంపించారట.

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. ఈ నెల చివరి వరకు సుకుమార్ ఈ పనులను కంప్లీట్ చేసుకుని పుష్ప షూటింగ్ మొదలు పెట్టె పనిలో ఉంటారని అంటున్నారు. ఈ గ్యాప్ లో మెగాస్టార్  వేదాలం రీమేక్ కి తనదైన మార్క్ చూపెట్టి ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

 

 

 

 

 

 

 

 

 

 

 

5.KGF 2 న్యూ అప్డేట్..400 కోట్ల నుండి హీరో రెమ్యునరేషన్ అంత..?  

కన్నడ లో రూపొందించిన KGF సినిమా తెలుగు,తమిళ్,హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని KGF 2 కోసం టోటల్ ఇండియా వెయిట్ చేస్తుంది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని ఆల్ ఇండియా స్థాయిలో చాటి చెప్పిన KGF కు యశ్ మొదట  పారితోషికం తీసుకోకుండా విడుదలైన తర్వాత లాభాల్లో నుండి వాటా తీసుకున్నారు.     

KGF వంటి భారీ సినిమా బడ్జెట్ కష్టంగా మారడంతో పాటు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు ఉండటంతో నిర్మాతలు వెనుక ముందు ఆడారు. ఆ సమయంలో యశ్ తనకు రెమ్యునరేషన్ ఇవ్వనక్కర్లేదు. విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాను అన్నాడట. అలా మొదటి పార్ట్ యశ్ పారితోషికం తీసుకోకుండానే చేసినా లాభాల వాటాతో అతడికి కన్నడ హీరోల్లోనే అత్యధిక పారితోషికం దక్కింది.

ప్రస్తుతం KGF 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి KGF నిర్మాతలు యశ్ కు దాదాపుగా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముందే ఇచ్చారట. అది మాత్రమే కాకుండా లాభాల్లో వాటాను కూడా ఖరారు చేశారట. KGF 2 కు ఉన్న క్రేజ్ కారణంగా ఈసారి కూడా ఈజీగా 400వందల కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కనుక యశ్ కు 30 కోట్లను మించి లాభాల్లో షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.  

 

 

 

 

 

 

 

 

 

 

 6.ఆ బ్లాక్ బస్టర్ సినిమాని వద్దు అనుకున్ని మూడు ఫ్లోప్ సినిమాలను చేసిన రవి తేజ.!    

మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ కొట్టిన టైం లో కొత్త సినిమా ఏది కమిట్ అవ్వాలా అని ఎదురు చూస్తున్న టైం లో ఒక తమిళ్ సినిమా రవితేజ కి బాగా నచ్చింది, తెలుగు లో ఈ సినిమా విడుదల చేస్తే బాగుటుంది అనుకున్నాడు.

తమిళ్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నే తెలుగు వర్షన్ కి డైరెక్టర్ గా అనుకున్నారు. కొన్ని నెలల పాటు తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు కానీ ఆ మార్పులు చేర్పులు రవితేజ కి నచ్చలేదు. దాంతో ఒరిజినల్ ని అలానే చేద్దాం అనుకున్నారు కానీ తర్వాత ఏమైందో తెలియదు సడెన్ గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఇప్పుడు ఆ సినిమా తెలుగు లో డబ్ అయ్యి డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం.ఇప్పుడు ఆ సినిమా తెలుగు వర్షన్ టైలర్ కూడా విడుదల కాగా ఆ టైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఆ  సినిమా నే జయం రవి అరవింద్ సామి ల కాంబినేషన్ లో తనీ ఒరువన్ తర్వాత తెరకెక్కిన భోగన్ సినిమాఈ సినిమా తమిళ్ లో మొత్తం మీద 25 కోట్ల మేర కలెక్షన్స్ ని అందుకుని ఇప్పుడు తెలుగు విడుదలకు సిద్ధం అవుతుంది.  

రాజా ది గ్రేట్ టైం తర్వాత టచ్ చేసి చూడు అప్పటికే కొంత చేసి ఉండగా నేల టికెట్ ప్లేస్ లో ఈ సినిమా రీమేక్ చేయాల్సింది. కానీ ఈ సినిమాను వద్దు అనుకుని నేల టికెట్ చేయగా ఆ సినిమా ఫ్లాఫ్ అయింది. రవితేజ ఈ సినిమా చేసి ఉంటే హిట్ అయింది అని  అనుకుంటున్నారు.

 

 

 

 

 

 

 

 

7.BB3 కి ఆ ఇద్దరు ఇక ఫిక్స్ కాలేదు అంట..?

నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా మరియు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వస్తున్న మూడువ సినిమా కావడంతో సినిమాపై భారీ హైప్ ఉంది. ప్రస్తుతం ఇద్దరూ కూడా పెద్దగా ఫామ్ లో లేరన్న విషయం తెలిసిందే.

బాలయ్య లాస్ట్ ఇయర్ వరుసగా 3 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసు కుని హాట్రిక్ ఫ్లాఫ్స్ ని కంప్లీట్ చేయగాబోయపాటి కూడా సరైనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టాల్సి ఉంది. ఇద్దరూ హిట్స్ లో లేకున్నా కానీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు పెరగగా ఇప్పటికే ఒకటి అరా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న  ఈ సినిమా కి అతి ముఖ్యమైన విలన్ అలాగే హీరోయిన్ మాత్రం ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉంది.

విలన్ గా అనేక మంది యంగ్ యాక్టర్స్ నుండి బాలీవుడ్ లో సంజయ్ దత్ వరకు అనుకోగా హీరోయిన్ గా అంజలి, శ్రేయ, నయనతార ఇలా చాలా మందినే అనుకున్నారు కానీ ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదని సమాచారంవిలన్ విషయం లో బాలయ్య ని ఢీ కొట్టే వ్యక్తి కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉండగా హీరోయిన్ ని మాత్రం ఇప్పుడు ఎవ్వరూ సెట్ అవ్వకపోతేకొత్త హీరోయిన్ ని లాంచ్ చేసే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నారని అంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ నెలలో జరుగుతుంది అని సమచారం.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

8.300 కోట్ల సినిమాని పక్కన పెట్టి 80 కోట్ల సినిమా చేస్తున్న కమల్ హాసన్..!

కోలీవుడ్ సూపర్ స్టార్  కమల్ హాసన్ ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మధ్యలో బిగ్ బాస్ తమిళ్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ లేక పోవడం తో పెర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుండగా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా శంకర్ దర్శకత్వంలోనే ఇండియన్ 2 సినిమా ను అత్యంత భారీ ఎత్తున 300 కోట్లతో మొదలు పెట్టినప్పటికీ మొదటి నుండి ఎదో ఒక అవరోధం వస్తూనే ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి అనుకున్న ఈ సినిమా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కూడా కలిసి ఏకంగా 2022 సంక్రాంతి కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ఈ గ్యాప్ లో కమల్ హాసన్ ఏం చేస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైం లో రీసెంట్ టైం లో రెండు సినిమాలతోనే తమిళ్ లో సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు కమల్ హాసన్. ఖైదీ బ్లాక్ బస్టర్ తర్వాత కోలివుడ్ టాప్ హీరో విజయ్ తో మాస్టర్ చేసిన లోకేష్ ఇప్పుడు కొత్త సినిమాను కమల్ తో అనౌన్స్ చేయగా ఈ సినిమా ను 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో షూటింగ్ జరిపి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

9.RRR తరువాత..280 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ కొత్త సినిమా..?  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 లో వచ్చిన అరవింద సమేత వీర రఘువ సినిమా బిగ్గెస్ట్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని s.s. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ తో సినిమా వచ్చే ఏడాది మొదట్లో మొదలు అవుతుందని సమచారం.

సినిమా ను ముందు వచ్చే ఇయర్ సమ్మర్ కి అనుకున్నా ఇప్పుడు లెక్కలు మారి వచ్చే ఇయర్ ఎండ్ లేదా 2022 లో రావచ్చు అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ అత్యంత భారీ ఎత్తున రూపొందబోతుంది అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.

ఆ న్యూస్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా… 280 కోట్ల రేంజ్ లో ఉంటుందని, కన్నడ తెలుగు భాషల్లో ఏక కాలం లో రూపొందే ఈ సినిమా మిగిలిన భాషల్లో డబ్ అవుతుందని అని సమచారం.  

  

 

 

 

 

 

 

 

 

 

 

10.కార్తికేయ 2 సినిమాని పక్కన పెట్టి ఆ సినిమా చేస్తున్న నిఖిల్.!  

యంగ్ హీరో నిఖిల్ కెరీర్ మొదట్లో జోరు చూపినా తర్వాత స్లో అయ్యాడు, మళ్ళీ స్వామిరారా సినిమా నుండి సినిమాల విషయం లో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి స్టొరీలను ఎంచుకుంటూ దూసుకు పోతుండగా మధ్యలో ఒకటి రెండు సినిమాలు నిరాశ పరిచాయి, లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ గాడిలో పడ్డ లో నిఖిల్ తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్స్ లో ఒకటైన కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ 2 ని భారీ లెవల్ లో పాన్ ఇండియా మూవీ గా మార్చాలని నిర్ణయం తీసుకోగా ముందు 18 కోట్ల రేంజ్ బడ్జెట్ లో అనుకున్నా తర్వాత అది 30 కోట్ల రేంజ్ కి మారగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో తిరిగి మొదలు అవుతుంది అనుకున్నా కానీ యూనిట్ ముందు ఫారన్ లొకేషన్స్ లో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేయగా పరిస్థితులు ఇంకా సద్దుకోక పోవడం తో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ని ఆపేశారు, దాంతో ఈ గ్యాప్ లో చందు మొండేటి ఓ చిన్న సినిమా చేయాలి అని ఫిక్స్ అవ్వగా నిఖిల్ ఈ గ్యాప్ లో తర్వాత కమిట్ అయిన సినిమాను కార్తికేయ 2 ప్లేస్ లో మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సుకుమార్ కథ అందించిన 18 పేజెస్ మూవీ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం.