నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన సినిమా నర్తనశాల. భారీ స్టార్ కాస్ట్ తో బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా ను కొంత భాగం షూటింగ్ జరిపిన తర్వాత 2004 లో అనుకోకుండా సౌందర్య గారి మరణం వలన మధ్య లోనే ఆపేయాల్సి వచ్చింది, తర్వాత ఈ ఫూటేజ్ ని ఎం చేయాలో తెలియక అలానే ఇన్నాళ్ళు ఉంచేశాడు బాలయ్య

కానీ ఇన్నేళ్ళ తర్వాత ఈ 17 నిమిషాల లెంత్ ఉన్న ఈ ఫూటేజ్ ని ఈ విజయదశమి కానుకగా రిలీజ్ చేసారు.ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చి భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అయ్యింది.  

కథలోకి వెళితే..

12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పాండు కుమారులు అలియాస్ పాండవులు అరణ్యవాసం చివరి రోజు తమ అజ్ఞాతవాసం ఎలా పూర్తి చెయ్యాలి? ఎక్కడైతే తమరికి సురక్షితంగా ఉంటుంది? ఎవరెలాంటి వేశాల్లోకి మారాలని అని చాడ్చించుకోవడమే ఈ 16 నిమిషాల కథ..

నటీనటుల ప్రతిభ..

అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులు పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. అలాగే మధ్యలో బాలయ్య ధర్మరాజు గొప్పతనం గురించి చెప్పే పౌరాణిక డైలాగ్ చూసే అభిమానులకు వారెవ్వా అనేలా చేస్తుంది. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సౌందర్య గారి విజువల్స్, ఆమె కనిపించిన రెండు సీన్స్ కన్నుల విందుగా అనిపిస్తుంది. భీముడిగా శ్రీహరి చేసిన సీన్ చూసాక, ఆయన చేసిన పాత్రలన్నీ కళ్ళముందు కదిలేలా చేస్తుంది. శరత్ కుమార్ కూడా బాగా చేశారు. ఈ 16 నిమిషాల ఫుటేజ్ లో దాదాపు 6 నిమిషాల ఫుటేజ్ అన్నగారైన నందమూరి తారకరామారావు నటించిన నర్తనశాల లోని ఫుటేజ్ ని వాడారు. ఒకేసారి అన్నగారిని కూడా చూడడం బాగా అనిపిస్తుంది. అలాగే చివర్లో టాప్ హీరోమూవీ లోని సామజవరాగమన సాంగ్ లోని బాలయ్య బృహన్నలడాన్స్ బిట్ తో ముగింపు ఇవ్వడం సడన్ గా జోష్ తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం..

మొదటిసారి నందమూరి బాలకృష్ణ చేసిన దర్శకత్వం పరవాలేధనిపిస్తుంది. పలువురు నటీనటులు లేకపోయినా వాళ్ళకి సింక్ అయ్యేలా డబ్బింగ్ చెప్పించడం చాలా బాగుంది.

విశ్లేషణ..

NBK  నర్తనశాల అని రిలీజ్ చేసిన ఈ 16 నిమిషాల కంటెంట్ లో ఒరిజినల్ కంటెంట్ తక్కువ ఉండడం వలన, అన్నగారి నర్తనశాల నుంచి 6 నిమిషాలు యాడ్ చేసి ఆసక్తిగానే కట్ చేసారు. నందమూరి అభిమానులు చూస్తున్నంత సేపు మంచి ఫీల్ కి లోనవుతారు. మిగిలినవారు కూడా మన మధ్య లేని నటుల కోసం చూడచ్చు.