ఆకాశం నీ హద్దు రా మూవీ రివ్యూ.! బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే 200 కోట్లు పక్క.!  

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా సరైన హిట్ లేక ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరు తో డబ్ అవ్వగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన డైరెక్ట్ రిలీజ్ ను దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన గిఫ్ట్ ఇచ్చింది.

సినిమా కథ ఏంటి, సినిమా అంచనాలను ఏ రేంజ్ లో అందుకుందో తెలుసుకుందాం పదండీముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన హీరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తూ ఉండగా తన తండ్రి కి అనారోగ్యం వలన వెంటనే వెళ్ళాల్సిన అవసరం రాగా….

చాలినన్ని డబ్బులు లేక పోవడంతో విమానంలో ప్రయాణించలేకపోతాడుతన తండ్రి చివరి చూపులు చూసుకోలేదుతన లైఫ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వలన ఇతరులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఇబ్బంది పడకూడదు అని అతి తక్కువ డబ్బు తో విమాన ప్రయాణం చేయించాలని డిసైడ్ అవుతాడు.

పక్కా ప్లాన్ తో ఎయిర్ కంపెనీ ని మొదలు పెట్టాలని డిసైడ్ అవ్వగా అడుగడుగునా తనకి అవరోధాలు వస్తాయి, ఎదురైన ప్రతీ అవరోధాన్ని దాటుకుంటూ సూర్య ఎలా తను అనుకున్నది సాధించాడు అన్నది అసలు కథపెర్ఫార్మెన్స్ పరంగా సూర్య నట విశ్వరూపం సినిమా లో చూడొచ్చు. తను ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే

కానీ రీసెంట్ టైం లో తన నటనకి సరిపడా కథలు దక్కలేదు, కానీ ఈ సినిమా లో తన నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి, సూర్య పాత్రతో స్టార్ట్ లోనే మనం కూడా జర్నీ చేయడం మొదలు పెడతాం, తను భాద పడితే మనమూ బాద పడటం, తన విజయాన్ని మనం కూడా ఓన్ చేసుకుంటాం.

ఇలా తన పాత్ర ని కంప్లీట్ గా సూర్య కంట్రోల్ లో తీసుకుని తన కెరీర్ బెస్ట్ లో ఒకటి లేదా ఇదే కెరీర్ బెస్ట్ అనిపించే రేంజ్ పెర్ఫార్మెన్స్  ఇచ్చాడు, కొన్ని సీన్స్ లో సూర్య నటన కి సెల్యూట్ చేసి తీరాల్సిందే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కొత్తమ్మాయి అపర్ణ సూర్య పక్కన బాగా సూట్ అయింది.

తన పాత్ర కూడా చాలా బాగా ఆకట్టుకోగా ఇద్దరి జంట చాలా బాగుంది, ఇక పరేష్ రావెల్ విలనిజం ఆకట్టుకోగా మోహన్ బాబు స్పెషల్ రోల్ క్లైమాక్స్ లో తన మార్క్ చూపెట్టి మెప్పిస్తుంది, మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా తమ వరకు న్యాయం చేసి పాత్రలకి జీవం పోశారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు అదుర్స్ అనిపిస్తుంది, సీన్ బై సీన్ సినిమా పై ఆసక్తి మరో లెవల్ కి వెళ్ళేలా చేసి ఇంటర్వల్ పాయింట్ దగ్గర సెకెండ్ ఆఫ్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది, అదే టైం లో సెకెండ్ ఆఫ్ కథ కూడా ఊహించేలా ఉంటుంది…. అక్కడ నుండి కొద్దిగా డ్రా బ్యాక్ మొదలైంది, అది తర్వాత మాట్లాడుకుందాం

సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం జివి ప్రకాష్ కుమార్ కుమ్మేశాడుఆ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సూర్య కి మన సత్యదేవ్ తెలుగు డబ్బింగ్ బాగా అనిపించినా కానీ

సూర్య కి ఇది వరకు తెలుగు లో డబ్బింగ్ చెప్పిన వాయిస్ నే పెడితే బాగుండు అనిపించింది,… ప్రొడక్షన్ వాల్యూస్ అదిరి పోగాడైరెక్షన్ పరంగా సుధ కొంగర రియల్ లైఫ్ స్టొరీ ని సినిమాగా చాలా బాగా ఆకట్టుకునేలా డైరెక్ట్ చేయగా ఆ కథకి సూర్య 100% న్యాయం చేసి మరో లెవల్ కి వెళ్ళేలా చేశాడు.

కానీ ఫస్టాఫ్ ఇచ్చినంత కిక్ సెకెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది అని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ లో హీరో కి మరిన్ని కష్టాలు ఎదురు అవుతూ ఉండగా అవి కొంచం రిపీటివ్ గా అనిపిస్తాయి, అలాగే ప్రతీ చోటా హీరో కి ఇలా అడ్డు వస్తూ ఉండటం అనుకున్నది జరగక పోతూ ఉండటం తో అసహనం కూడా అనిపిస్తుంది.

కానీ వాటిని అన్నీ మరిపించే విధంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ తో అద్బుతంగా కవర్ చేసి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ ఉండేలా చేయడంలో డైరెక్టర్ సుధ కొంగర మరియు సూర్య సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఇది బయోపిక్ కమర్షియల్ మూవీ కాదు అని గమనించి….

సినిమా చూడటం మొదలు పెడితే సినిమా అయిపోయాక ఒక అద్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది, రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసేవారికి కూడా సినిమా నచ్చుతుంది కానీ మరీ ఇంత ఇంపాక్టివ్ గా ఉండదుసినిమా సూర్య రీసెంట్ టైం లో ది బెస్ట్ అండ్ కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3.25 స్టార్స్…. సెకెండ్ ఆఫ్ లో సగం వరకు డౌన్ అవ్వక పోయి ఉంటే సినిమా 3.5 రేటింగ్ తో మినిమమ్ అందుకునే సత్తా ఉన్న సినిమా అని చెప్పాలి. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కి ఆడియన్స్ నుండి మరో లెవల్ రెస్పాన్స్ వచ్చి ఉండేది.

 

 

 

 

 

16 నిమిషాల మినీ మూవీకి  2 వీక్స్ లో దుమ్ములేపే కలెక్షన్స్.!   

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నర్తనశాల, ఆల్ మోస్ట్ 16 నిమిషాల ఫూటేజ్ షూటింగ్ చేసిన తర్వాత ద్రౌపతి పాత్ర పోషించిన సౌందర్య గారి మరణం వలన సినిమా షూటింగ్ ఆగిపోగా ఆ ఫూటేజ్ ను తర్వాత అలానే ఉంచగా ఆల్ మోస్ట్ 16 ఏళ్ల తర్వాత ఈ ఫూటేజ్ ను మినీ మూవీ గా మార్చి దసరా కానుక గా డిజిటల్ రిలీజ్ గా రిలీజ్ చేశారు.

కాగా సినిమా కి ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ రాగా ఈ మినీ మూవీ కి రికార్డ్ లెవల్ లో వ్యూస్ దక్కడం విశేషం అని చెప్పొచ్చు. కాగా 50 టికెట్ రేటు తో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 1 లక్షా 95 వేల వ్యూస్ ని,

వీకెండ్ లో 2 లక్షల 85 వేల వ్యూస్ ని, 5 రోజుల్లో 4 లక్షల 15 వేల వ్యూస్ ని సొంతం చేసుకోగా మొదటి వారం లో 5 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది, మొదటి 10 రోజులు పూర్తీ అయ్యే సరికి 5 లక్షల 46 వేల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు

రెండు వారాలను సాధించిన వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో రిలీజ్ అయ్యాయి, ఆ లెక్కల ప్రకారం మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో సినిమా కి 34 వేల దాకా వ్యూస్ దక్కగా టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి ఈ మినీ మూవీ టోటల్ గా 5 లక్షల 80 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ మినీ మూవీ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చి ఉంటాయి అంటే 50 టికెట్ రేటు తో 5 లక్షల 80 వేల యూనిక్ వ్యూస్ కి సినిమా టోటల్ గా 2.9 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉంటుందని అంటున్నారు. ఇది నిజంగానే మాస్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో 3 కోట్ల మార్క్ ని అందుకుని పరుగును ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

కలర్ ఫోటో మూవీ 2 వీక్స్ లో దుమ్ములేపే ఊరమాస్ కలెక్షన్స్ రికార్డ్!

రీసెంట్ టైం లో ఆడియన్స్ మనసును గెలుచుకున్న హార్ట్ టచింగ్ మూవీ కలర్ ఫోటో, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని ఉండేది కానీ డైరెక్ట్ రిలీజ్ వలన సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది అన్నది క్లియర్ అయినా కానీ ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకున్నది అన్నది మాత్రం అందరికీ అయితే తెలియ లేదు అనే చెప్పాలి.

ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆహా వీడియో వాళ్ళ 1 నెల సబ్ స్క్రిప్షన్ రేటు 50 ని టికెట్ రేటు గా భావించి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి ఉండవచ్చు అనేది అంచనా వేస్తె…. సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు

మొదటి 10 రోజులకు గాను రిలీజ్ అయిన విషయం తెలిసిందే, మొదటి రోజు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని, వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని ,5 రోజులు పూర్తీ అయ్యే సరికిమొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి…. 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని సొంతంచేసుకుంది. 

ఇక 10 రోజులకు గాను సినిమా 7 లక్షల మార్క్ ని అందుకుంది అంటున్న ఈ సినిమా మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో కూడా వ్యూస్ ప్రభావం కొనసాగగా మరో 40 వేల దాకా వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకోగా మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి మొత్తం మీద ఈ సినిమా….

7 లక్షల 40 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారంఇక 50 టికెట్ రేటు తో 7 లక్షల 40 వేల వ్యూస్ కి 3.7 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండ వచ్చని అంచనా వేయవచ్చు. సినిమాను 3 కోట్లు పెట్టి కొన్న ఆహా వీడియో వాళ్లకి ఇప్పటికే 70 లక్షల ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చుటికెట్ రేటు ఎక్కువ అనుకుంటే ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.