ఇదిలా వుంటే ఈ మూవీస్ తో పాటు రామ్ చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. తాజాగా ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ తెలుగు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడానికి రామ్చరణ్ ని రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందు కోసం ఆయనతో తాజాగా ఒప్పందాన్ని కూడా చేసుకున్నట్టుగా తెలిసింది.


డిస్నీప్లస్ హాట్ స్టార్ తన కార్యకలాపాలను తెలుగు భాషలో మరింత ఉదృతం చేయాలని యోచిస్తోంది. చాలా మంది వీక్షకులను ఆకర్షించడంలో భాగంగా రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని అతనితో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో భాగంగా మెజీషియన్ గా డీస్నీ ప్లస్ హాట్ స్టార్ కి సంబంధించిన ప్రచార చిత్రంలో కనిపించనున్నారని తెలిసింది. ఈ ప్రకటనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

RRR తరువాత మహేష్ తో లేనట్టే?


ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పటికే రివీల్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించారు కూడా. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రం వుండబోతోందని కీలక సమాచారం కూడా బయటికి వచ్చేసింది. అయితే ఇంతలోనే ఊహించని మలుపు. ఇక్కడో షాకింగ్ విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. `ఆర్.ఆర్.ఆర్` తరువాత మహేష్ తో జక్కన్న సినిమా చేయడం లేదనేది ఆ గుసగుస సారాంశం.

మహేష్ తో సినిమా చేయడానికి ముందు జక్కన్న ఓ బాలీవుడ్ చిత్రాన్ని చేయబోతున్నారట. ప్రస్తుతం మహేష్ చేస్తున్న `సర్కారి వారి పాట` వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకోబోతున్నారు మహేష్. ఈ సమయాన్ని మరో సినిమా కోసం వాడుకోవాలనుకుంటున్నారట జక్కన్న. `మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రాజమౌళి `మర్యాద రామన్న` పేరుతో సునీల్ ని హీరోగా పెట్టి ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. `ఆర్.ఆర్.ఆర్` తరువాత అదే ఫార్ములాని ఫాలో అవుతూ అతి తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది.

ఈ సినిమాని పూర్తిగా బాలీవుడ్ నటీనటులు.. టెక్నీషియన్ లతో చేయబోతున్నారట. నెలంటే నెల రోజులు మాత్రమే చిత్రీకరణకు ఉపయోగించి మరో నెల పోస్ట్ ప్రొడక్షన్.. మరో నెల ప్రమోషన్స్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది రాజమౌళి ఆలోచనగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ఎలాంటి స్టార్ లు వుండరని.. చిన్న నటులతో ఈ మూవీని అత్యంత ప్రయోగాత్మకంగా చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీనికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారా? లేక పర్యవేక్షకుడిగా వుంటారా? అన్నది మాత్రం తెలియాల్సి వుంది.


RRR వడ్డీ కలిపితే బడ్జెట్ తడిపి మోపెడు


ఇంకా ఇతర దేశాల్లో `బాహుబలి` తరహాలోనే అనువాదం కానుంది. అంటే ఈ లెక్కన బాక్సాఫీస్ బరిలోకి 1000 కోట్ల పైబడిన వసూళ్ల టార్గెట్ తో బరిలోకి దిగాలి. అప్పుడే ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్... లాభాలు ఆశించడానికి అవకాశం ఉంది. మరి ఆ రకంగా చూస్తే సినిమాకు అంత స్టామినా ఉందా? అంటే కాస్త రిస్క్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంత బలమైన స్క్రిప్ట్ అయినా హీరోల మార్కెట్ కూడా ఇక్కడ అత్యంత కీలకంగా మారాల్సి ఉంది. మరి చరణ్.. తారక్ బాక్సాఫీస్ స్టామినా ఎంటన్నది మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే అనాలి. ఇక ఈ చిత్రం హిందీ రైట్స్ ..శాటిలైట్ రైట్స్  పెన్ స్టూడియోస్ కి కట్టబెట్టారు. పోర్చుగీస్..కొరియన్..టర్కీష్.. స్పానిష్ భాషల డిజిటల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ కి అమ్మేసారు.

తెలుగు..తమిళం..కన్నడం..మలయాళం డిజిటల్ హక్కుల్ని జీ-5కి కట్టబెట్టారు. ఎన్నికోట్లకు ఇప్పటివకూ బిజినెస్ జరిగిందన్నది తేలాల్సి ఉంది. అయితే 550 కోట్ల బడ్జెట్ నడుమ దర్శక..నిర్మాతలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని గుసుగసు వినిపిస్తోంది. సినిమాను కోనుగోలు చేసిన ప్రతీ ఒక్కరు లాభపడితేనే సినిమా హిట్ కింద లెక్క. ఆ లెక్కలో ఎక్కడా తేడా జరిగినా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై డైలమా క్లియర్ కావాల్సి ఉంది. దసరా లేదా క్రిస్మస్ కి వస్తుందని ప్రచారమైంది. ఆ తర్వాత 2022లోనే వస్తుందని కథనాలొచ్చాయి.