దుబాయ్ లో `ఆర్.ఆర్.ఆర్` ప్రీరిలీజ్ ఈవెంట్.!అక్కడే ఎందుకు అంటే.?

 

మెగా పవర్ స్టార్ చరణ్ -యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈరెండు నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆరంభంలో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చేయాలని యూనిట్ గట్టిగా సంకల్పించి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారుట. యూనిట్ సహా  సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులందర్ని దుబాయ్ కి తీసుకెళ్లాలని టీమ్ సన్నాహాలు చేస్తుందిట. మరి తెలుగు రాష్ర్టాల్ని వదిలేసి జక్కన్న దుబాయ్ మీద ఎందుకు పడ్డారు? అంటే చాలా సంగతులే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. కానీ దుబాయ్ లో ఈవెంట్ చేస్తే పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది దాంతో రాజమౌళి అక్కడ ప్లన్ చేసాడు అని తెలుస్తుంది.  

 


1.30 కొడితే.. అయ్యగారే బాక్స్ ఆఫీస్ NO.1

అఖిల్ సినిమాతో హీరో గా  పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని  అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది. 

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 19 కోట్ల 26 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 

23  కోట్ల 08 LAKASHA షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అదే గ్రాస్ గా చూసుకుంటే 38.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.