1.తమిళ్ లో ఫ్లాప్ తెలుగులో హిట్..ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్ బస్టర్ రికార్డ్..? 

ఒకటి తర్వాత ఒకటి వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో టెంపర్ తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ఓ రేంజ్ లో అప్లాజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత కెరీర్ లో ఇప్పటి వరకు ఫ్లాఫ్ అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. అలాంటి టెంపర్ మూవీ రెండు చోట్ల రీమేక్ అయ్యింది. ఒకటి హిందీ లో మరోటి తమిళ్ లోహిందీ లో రణవీర్ సింగ్ సింబా పేరు తో రీమేక్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని  సొంతం చేసుకున్న ఈ సినిమా ను తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య పేరు తో రీమేక్ చేశాడు. విశాల్ మంచి పెర్ఫార్మెన్స్ నే ఇచ్చినా ఎందుకనో అక్కడ ఆడియన్స్ సినిమా ను హిట్ చేయలేదు. సినిమా మొత్తం మీద అక్కడ 10.55  గ్రాస్ ని మాత్రమె కలెక్ట్ చేసింది. కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి మరో 1.5 కోట్ల గ్రాస్ రాగామొత్తం మీద తమిళ్ వర్షన్ షేర్….5.5 కోట్ల రేంజ్ లో వచ్చింది, సినిమా కి అక్కడ 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా ఇదే పేరు తో తెలుగు లో డబ్ అయ్యి చాలా సైలెంట్ గా విడుదల అయినా కానీ జనాలు తెలుగు లో సినిమా ను బాగానే ఆదరించారు అని చెప్పాలి. తెలుగు లో సినిమాను… 2.2 కోట్లకు అమ్మగా…2.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో తెలుగు లో 1.86 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసింది. తమిళ్ తో పోల్చుకుంటే తెలుగు లో సినిమా కి కేవలం బిజినెస్ నుండి 34 లక్షల లాస్ మాత్రమే రావడం విశేషం అనే చెప్పాలి.  

----------------------------------------------------------------------------------------      

2. నాగచైతన్య చేతికి 70 కోట్ల సినిమా .?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గత సంవత్సరం మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో రెట్టించిన జోరు లో ఉండగా తన కొత్త సినిమా లవ్ స్టొరీ కూడా భారీ అంచనాలతో రూపొందగా సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా తర్వాత నాగ చైతన్య కొత్త సినిమా ను టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. డిఫెరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుని వాటికితనదైన స్టైల్ లో ట్రీట్ మెంట్ ని అందించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్లు కొట్టిన విక్రం కుమార్ ఈ మధ్య కొద్దిగా స్లో అయినా ఈ సినిమా తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుండగా నాగ చైతన్య ఈ సినిమా తర్వాత సినిమాలను కూడా కమిట్ అయ్యే పనిలో ఉండగారీసెంట్ గా ఓ భారీ బడ్జెట్ కథని విన్నాడని టాక్…. టాలీవుడ్ లో ఒక జానర్ కే పరిమితం అవ్వకుండా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో తనకంటూ ఒక గుర్తుంపు సొంతం చేసుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి రీసెంట్ గా వి ది మూవీ చేయగా ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో నాని ని డిఫెరెంట్ గా చూపెట్టడం సుధీర్ బాబు లో మాస్ హీరో ఉన్నాడని ఎలివేట్ చేయడం అందరికీ బాగా నచ్చగా తన తర్వాత సినిమా ను నాగ చైతన్య చేయాలి అనుకున్న మోహనకృష్ణ ఓ భారీ సబ్జెక్ట్ ని నాగ చైతన్య కి వినిపించారని అంటున్నారు. పూర్తిగా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో….తెరకెక్కే ఈ సినిమా కి 70 కోట్ల రేంజ్ బడ్జెట్ అవసరం అని రీసెంట్ గా ఇదే కథని దిల్ రాజు కి వినిపించగా వి మూవీ ఎఫెక్ట్ వలన ఈ సబ్జెక్ట్ ని వద్దూ అన్నప్పటికీ నాగ చైతన్య ఓకే అంటే వేరే నిర్మాత తో చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, కానీ నాగ చైతన్య తన నిర్ణయాన్ని ఇంకా చెప్పాలి ఉందని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

------------------------------------------------------------------------------------

3. 3 వరుస డిసాస్టర్లుఅయినా కొత్త సినిమాకి దిమ్మతిరిగే రేటుబాలయ్య దెబ్బకు ఇండస్ట్రీ షేక్.!   

నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 గత సంవత్సరం అస్సలు కలిసి రాలేదు, 2018 ఇయర్ సంక్రాంతి కి జై సింహా సినిమా తో మెప్పించిన బాలకృష్ణ గత సంవత్సరంలో  చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు మరియు రూలర్ సినిమా లు ఒకటి తర్వాత ఒకటి భారీ ఫ్లాఫ్స్ గా మిగలగా ఆ ఇంపాక్ట్ బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ పై గట్టిగా పడుతుందని అంతా అనుకున్నారు. తన అప్ కమింగ్ మూవీడైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టని కారణంగా వీళ్ళ కాంబో లో ఇది వరకు సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినా ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉండటం తో ఎలాంటి బిజినెస్ వీళ్ళ హాట్రిక్ మూవీ కి జరుగుతుంది అన్నదిఅందరి లోనూ డౌట్ ని కంటిన్యు చేస్తున్న టైం లో బాలకృష్ణ బోయపాటి శ్రీను ల మూడో సినిమా డిజిటల్ బిజినెస్ దుమ్ము లేపే రేంజ్ లో జరిగిందని టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని టాప్ OTT కంపెనీ 9.15 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. పేరు రివీల్ చేయలేదు కానీ ప్రైమ్ వీడియో నే ఎక్కువగా సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమె జరిగిన సినిమా కి డిజిటల్ రైట్స్ కిందనే 9.15 కోట్లు పలకడం అది కూడా ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఈ రేటు అంటే గొప్పే అని చెప్పాలి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా నెక్స్ట్  ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేసి విడుదల చేస్తారని అంటున్నారు.

------------------------------------------------------------------------------------

4.అనుష్క  పైన  పైచేయి సంధించిన రాజ్ తరుణ్.!

ఒక సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేదా డైరెక్ట్ డిజిటల్ విడుదల ని సొంతం చేసుకున్నా కానీ జనాలకు ఎంత ఎక్కువగా తెలుస్తుంది అన్న దాని మీదే సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉంటుంది, ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసుకునే పరిస్థితులు ఏమాత్రం లేక పోవడం తో ఎక్కువగా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ నే సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఇది ఎక్కువగా ఉండగా సినిమాలనుకొన్న వాళ్ళు యూనిట్ తో ప్రమోషన్ ని కూడా చేయించాలని చెప్పి మరీ సినిమాలను కొంటున్నారు, సౌత్ కి వచ్చే సరికి సినిమాల ప్రమోషన్ విషయం లో పెద్దగా జొష్ చూపరు కాబట్టి రేటు కొద్దిగా తగ్గించి ఇస్తున్నారు. ఇక లేటెస్ట్ గా తెలుగు లో 2 సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అవే ఒకటి అనుష్క నటించిన నిశ్శబ్దం, మరోటి రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలుఈ రెండూ కూడా ఇప్పుడు అక్టోబర్ 2 న రిలీజ్ కానుండగా ఇందులో అనుష్క నిశ్శబ్దం సినిమా కి 23 కోట్ల రేటు పెట్టి అమెజాన్ ప్రైమ్ కొనగా రాజ్ తరుణ్ఒరేయ్ బుజ్జిగా సినిమా కి 4 కోట్ల రేంజ్ కి ఆహా వీడియో వాళ్ళు కొన్నారుఇక్కడ ప్రమోషన్ విషయానికి జనాలకు రీచ్ అయ్యే విషయానికి వస్తే నిశ్శబ్దం సినిమా కి పెట్టింది 23 కోట్లు అయినా జనాల్లో రీచ్ కానీ యూనిట్ ప్రమోషన్ కానీ చాలా నీరసంగా ఉందని చెప్పాలి. అదే సమయం లో రేటు చాలా తక్కువే అయినాఒరేయ్ బుజ్జిగా సినిమా మాత్రం చాలా బాగా ప్రమోట్ చేసుకుంటూ 6 నెలల్లో మొట్ట మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. జనాల్లో ప్రస్తుతం ఎక్కువ రీచ్ మాత్రం ఒరేయ్ బుజ్జిగా సినిమాకే ఉందని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో అక్టోబర్ 2 న తేలనుంది.

------------------------------------------------------------------------------------

5.OTT హిట్ భానుమతి-రామకృష్ణ బడ్జెట్ and టోటల్ ప్రాఫిట్ ఇదే.!

థియేట్రికల్ విడుదలు చేసుకునే అవకాశం లేక పోవడం తో చాలా సినిమాలు గత 6 నెలల నుండి డైరెక్ట్ గా డిజిటల్ విడుదలను సొంతం చేసుకుంటూ వస్తుండగా అందులో తెలుగు లో ఆకట్టుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ సినిమా ఒకటని చెప్పాలి. ఈ సినిమా ను తక్కువ బడ్జెట్ లోనే తెరకేక్కించగా మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది. సినిమా కి OTT ద్వారా కూడా మంచి రేటు దక్కగా తర్వాత శాటిలైట్ రైట్స్ తో మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ముందుగా సినిమా బడ్జెట్ ను గమనిస్తే, సినిమాను 1 కోటి లోపు బడ్జెట్ లోనే పరిమితులతో కూడా క్వాలిటీగా తెరకెక్కించారు. లెంత్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా తక్కువ నిడివి తో తీయడం కలిసి రాగా సినిమా ను ఆహా వీడియో వాళ్ళు 1.45 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా. వాళ్లకి మూడు నెలల్లో పెట్టిన పెట్టుబడి కి సాలిడ్ గా వ్యూస్ దక్కి రికవరీ కూడా అయ్యిందని టాక్ ఉంది.ఈ సినిమా బడ్జెట్ మీద సినిమా కి 1.9 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని నిర్మాత కి మంచి ప్రాఫిట్ ని తేవడమే కాకుండా కొన్న OTT యాప్ కి కూడా ప్రాఫిట్ ని తెచ్చి పెట్టేందుకు సిద్ధం అవుతుండటం విశేషం అనే చెప్పాలి.

------------------------------------------------------------------------------------

6.జెర్సీ రీమేక్ కి షాయిద్ కపూర్ రెమ్యునరేషన్ చుస్తే షాకే.?  

నాని కెరీర్ లో వన్ ఆఫ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమాలో ఒకటైన జెర్సీ సినిమాను అదే పేరుతో హిందీ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో షాయిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు.ఈ సినిమా కి షాయిద్ కపూర్ సాలిడ్ గా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఆల్ మోస్ట్ కబీర్ తో పోల్చుకుంటే డబుల్ రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడట… 42 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్ లో 10% షేర్ కూడా షాయిద్ కి వెళ్ళబోతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం జరిగినప్పటికీ కరోనా వలన షూటింగ్ ఆగి పోగా ఇంకా మొదలు కాలేదు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో అనుకున్నారు కానీ ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో కబీర్ సింగ్ రిలీజ్ అయిన టైం కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.  

------------------------------------------------------------------------------------  

7. 70 కోట్ల సినిమా కి నో చెప్పిన దిల్ రాజు.!అసలు కారణం ఏమిటి.?

నిర్మాత దిల్ రాజు సినిమాల నిర్మాణం విషయం లో పక్కాగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే, ఒక సినిమా బడ్జెట్ విషయం లో కానీ విడుదల విషయం లో కానీ ఆయన ఇన్వాల్వ్ మెంట్ చాలా ఉంటుంది, పరిమిత బడ్జెట్ లలోనే సినిమా లను తీసి మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న దిల్ రాజు కూడా అడపా దడపా కొన్ని బిగ్ మూవీస్ చేసి నష్టాలను సొంతం చేసుకున్నారు. అందుకే ఆ తప్పులు రిపీట్ అవ్వకూడదు అని సినిమాల బడ్జెట్ విషయం లో గట్టిగా ఉంటారు, అయినా కానీ కొన్ని సార్లు బడ్జెట్ అంచనాలను మించి పోతూనే ఉంటుంది, లేటెస్ట్ గా దిల్ రాజు నిర్మాణం లో నాని 25 వ సినిమా v మూవీ ని….సుమారు 25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తీయాలి అనుకున్నారు, కానీ బడ్జెట్ మొత్తం మీద 35 కోట్ల దాకా వెళ్ళింది, కానీ సినిమా క్వాలిటీ అదిరింది కానీ సినిమా కంటెంట్ ఆకట్టుకునేలా లేక పోవడం తో ఆడియన్స్ రిజక్ట్ చేశారు కానీ OTT కి భారీ రేటు కి అమ్మడం వలన అందరూ సేఫ్ అయ్యారు. ఈ సినిమా స్టొరీ చెప్పినప్పుడే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ భారీ సినిమా కాన్సెప్ట్ అండ్ బడ్జెట్ ని చెప్పారట. v మూవీ సక్సెస్ ని బట్టి ఆ సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్పగా ఇప్పుడు v మూవీ రిజల్ట్ రావడం తో తన వంతుగా డైరెక్టర్ మరోసారి దిల్ రాజు ని అప్రోచ్ అయ్యి ఈ సినిమా గురించి చెప్పగాబడ్జెట్ 70 కోట్ల రేంజ్ లో ఉంటుంది అని చెప్పడం తో దిల్ రాజు ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ మూవీ వద్దు మీ స్టైల్ లో ఒక లవ్ స్టొరీ లేదా ఎంటర్ టైనర్ కథని చెప్పండి అది చేద్దాం అని చెప్పారట. దాంతో ఆ భారీ బడ్జెట్ మూవీ ని డైరెక్టర్ ఇప్పుడు పక్కకు పెట్టారని టాక్ ఉంది, దిల్ రాజు మళ్ళీ అంత బడ్జెట్ తో రిస్క్ చేయడం ఇష్టం లేక ఇలా చెప్పారని కూడా ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.

------------------------------------------------------------------------------------

8.మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం రెండు సార్లు మిస్ చేసుకున్న టాప్ డైరెక్టర్.?   

1990 సంవత్సరంలో వరుస హిట్ లతో ఇండస్ట్రీలో దూసుకున్ని వచ్చిన డైరెక్టర్ sv.కృష్ణారెడ్డి.చాలా రోజుల తరువాత అలీ టాక్ షో ద్వారా వెలుగులోకి వచ్చారు.ఈ ఇంటర్వ్యూలో  కొన్ని ఆసక్తి కరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకొన్నాడు.    

శుభలగ్నం సినిమా హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడానికి సిద్ధం అయ్యాను.ఈ సినిమా అశ్వినీదత్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమాని  హైటెక్నాలజీ తో తీయాలి అనుకున్నాము.

కానీ సినిమా బడ్జెట్ వర్క్ ఔట్ అవుతుందో లేదో అనే భయంతో సినిమాను వదిలేశాం.ఆ తరువాత రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా   రూపొందిన ఒక సినిమాకు నన్నుమ్యూజిక్ అందించమన్నారు. ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పాను.అలా రెండు సార్లు మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసే అవకాశంని మిస్ చేసుకున్న అని చెప్పారు.   

------------------------------------------------------------------------------------

9.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకి NO చెప్పిన కోలీవుడ్ సూపర్ స్టార్..?  

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో పోటిబడి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా 'అల... వైకుంఠపురములో.ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించిది.

ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో మాధవన్‍ ని తీసుకోవాలి అని చిత్రయూనిట్ ప్లన్ చేసారు.కానీ మాధవన్‍ నో చెప్పాడు అని టాక్ వినిపిస్తుంది.

దాంతో సుకుమార్ మరో సీనియర్ హీరో ని విలన్ గా తీసుకోవాలి ని ప్లన్ చేస్తున్నాడు అని టాక్.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ చేసే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ ప్లన్ చేస్తుంది. 

------------------------------------------------------------------------------------

10.18 సంవత్సరంలా తరువాత ఆ హీరొయిన్ తో చేయడానికి ఒకే చెప్పిన మెగాస్టార్..?   

మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమా తరువాత కొరటాల శివదర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని V.V.వినాయక్ దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ అయిన లూసిఫర్‍ సినిమాని తెలుగులో రీమేక్‍ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఒక ముక్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణ అయితే బాగుంటుందని V.V.వినాయక్ మెగాస్టార్ కి  సూచించినట్టు సమాచారం.మెగాస్టార్ కూడా ఓకే చెప్పారు అని టాక్.ఈ ఇద్దరు కలిసి నటించిన లాస్ట్ సినిమా అంజి.దాదాపు 18 సంవత్సరంలా తరువాత మళ్ళీ ఒకే స్క్రీన్ పైకి రాబోతున్నారు.            

------------------------------------------------------------------------------------ 

END