“ఆదిపురుష్” నుంచి డిజప్పాయింట్ చేసారుగా..
ఈరోజు యంగ్ రెబల్
స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు, ప్రముఖులు
కూడా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ స్పెషల్ రోజున ప్రభాస్
నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నుంచి పలు ఆసక్తికర అప్డేట్స్ కోసం కూడా అంతా
ఎదురు చూడగా వాటిలో “రాధే శ్యామ్” నుంచి
మోస్ట్ అవైటెడ్ అప్డేట్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా
కాకుండా మరో భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” నుంచి
మరో సాలిడ్ అప్డేట్ ఆశించారు కానీ దర్శకుడు ఓంరౌత్ ఇచ్చిన అప్డేట్ పోస్టర్ చూసి
డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రీ లుక్ పోస్టర్ లాంటిది కూడా కానీ
పోస్టర్ ని ఓంరౌత్ షేర్ చేసి నార్మల్ విషెష్ ని తెలిపాడు. దీనితో వారు మరింత
డిజప్పాయింట్ చేసినట్టు అయ్యింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లు ఇతర అప్డేట్స్ లు ఇంకే
స్పెషల్ డేస్ కి వస్తాయో చూడాలి మరి.
Most Eligible Bachelor 8 Days Total Collections!
👉Nizam: 7.07Cr
👉Ceeded: 3.75Cr
👉UA: 2.18Cr
👉East: 1.11Cr
👉West: 90L
👉Guntur: 1.27Cr
👉Krishna: 1.00Cr
👉Nellore: 76L
AP-TG Total:- 18.04CR(29.72CR
Gross)
Ka+ROI: 1.36Cr
OS – 2.26Cr
Total WW: 21.66CR(36.10CR~ Gross)
‘రాధే శ్యామ్’ టీజర్ లో హైలెట్స్ అదే అంటున్న ఫ్యాన్స్.!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు
కానుకగా ‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది.
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’ లోని
విక్రమాదిత్యని ప్రేక్షకులకు పరిచయం చేసింది. నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు
చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు
కానీ నీకు చెప్పను, నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను,
నాకు అన్నీ తెలుసు కానీ నీకు చెప్పను, చెప్పినా
మీ ఆలోచనలకి అందదు అంటూ విక్రమాదిత్య పాత్రకు ఫ్యాన్స్ పరిచయం చేసింది.. అంతేకాదు
నా పేరు విక్రమాదిత్య. నేను దేవుని కాదు మీలో ఒక్కడిని కూడా కాదు అంటూ చెప్పిన ఈ
డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది.
2022 జనవరి 14 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ
సినిమాలో ప్రభాస్, పూజా హెడ్గేలు జోడీగా నటించారు. పాన్
ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు
భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.