యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది, అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆల్ మోస్ట్ రెండేళ్ళు ఎన్టీఆర్ గురించిన ఎలాంటి అప్ డేట్స్ లేక పోవడం తో ఎదురు చూసి చూసి నీరు గారిపోయిన ఫ్యాన్స్ ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కి రావాల్సిన ఇంట్రో టీసర్ కరోనా వలన లేట్ అవ్వడం తో మరింత వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఎట్టకేలకు 6 నెలల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందించిన వాయిస్ ఎక్స్ లెంట్ అనిపించే విధంగా ఉండగా జక్కన్న టేకింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపించేలా ఉంది, ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ ని తెప్పించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా దిగిపోయాడు, తన బాడీ, స్క్రీన్ ప్రజెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ఉందని చెప్పాలి.
రెండేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్ మీల్స్ పెట్టేశాడు జక్కన్న, ఎలివేషన్ షాట్స్, గూస్ బంప్స్ మూవ్ మెంట్స్ అన్నీ కూడా టీసర్ లో ఊహకందని లెవల్ లో ఉండగా భీమ్ ఫర్ రామరాజు కి తగ్గట్లు దుమ్ము లేపే విధంగా ఉందని చెప్పాలి. ఆల్ ఇన్ ఆల్ టీసర్ అంచనాలను కంప్లీట్ గా మించేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు యూట్యూబ్ లో ఈ టీసర్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.