నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి తనే డైరెక్టర్ గా మారి మొదలు పెట్టిన సినిమా నర్తనశాల.టాలీవుడ్ లో అప్పట్లో బిగ్గెస్ట్ సెట్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన విజువల్ వండర్ ఈ నర్తనశాల సినిమా.అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా ను కొంత భాగం. షూటింగ్ కూడా చేశారు, కానీ సడెన్ గా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.  కానీ ఓవరాల్ గా సినిమా ఫూటేజ్ 17 నిమిషాల వరకు ఉండగా ఎప్పటి నుండో ఇండస్ట్రీ వాళ్ళు అభిమానులు ఆ ఫూటేజ్ ని విడుదల చేస్తేచూడాలని ఉందని.

కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒప్పుకొని బాలకృష్ణ  ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఫూటేజ్ ని విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యాడు, ఈ నెల 24 న శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతుంది.దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ అభిమానులు కొందరు ఈ చిత్ర టికెట్‌ను ఏకంగా 10 లక్షలు పెట్టి కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బును ఛారిటీ కోసం వాడతానని బాలకృష్ణ చెప్పాడు. దాంతో మంచి పని కోసం బాలకృష్ణ చేస్తున్న ఈ పనికి సాయంగా నిలుస్తున్నారు అభిమానులు. 10 లక్షలు పెట్టి టికెట్ కొన్న అభిమానుల పేర్లను త్వరలోనే స్వయంగా బాలకృష్ణ  అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు అని సమచారం.