1."వెనమ్" ఫస్ట్ టైం TRP రేటింగ్ వచ్చింది.?  

వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ అన్ని ఛానెల్స్ కూడా కొత్త సినిమాలు దొరకని పరిస్థితి నెలకొంది ఇప్పుడు…. దాంతో ఒక్కో ఛానెల్ ఒక్క రకమైన పద్దతిని ఫాలో అవుతుంది, స్టార్ మా ఛానెల్ పాత తెలుగు అండ్ తమిళ్ డబ్బింగ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ ని అమ్ముడు పోనివి ఏరికోరి వాటి శాటిలైట్ రైట్స్ ని కొని టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండగాజీ తెలుగు ఏమో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోనీ ఓల్డ్ తెలుగు సినిమాల రైట్స్ ని కొని టెలికాస్ట్ చేస్తూ రేటింగ్స్ ని సాధిస్తుంది, ఇక జెమినీ టీవీ మాత్రం డబ్బింగ్ మూవీస్ ని టార్గెట్ చేసినా అవి ఓల్డ్ వి కాకుండా కొత్త డబ్బింగ్ రైట్స్ మధ్యలో ఆగినవిటార్గెట్ చేసి వాటిని టెలికాస్ట్ చేయగా వాటితో పాటు హాలివుడ్ తెలుగు డబ్బింగ్ మూవీస్ ని కూడా టార్గెట్ చేస్తూ టెలికాస్ట్ చేస్తుంది, అందులో భాగంగా ఇప్పుడు లాస్ట్ వీక్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన హాలివుడ్ మూవీ వెనమ్ ని టెలికాస్ట్ చేసింది రీసెంట్ గాసినిమాను ఎంతకు కొన్నారు అన్నది క్లారిటీ గా తెలియకున్నా కానీ మొత్తం మీద 10 లక్షల రేంజ్ రేటు కి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ గా సినిమా ను నైట్ 9 గంటల 30 నిమిషాలకు IPL పీక్ టైం లో చూసే టైం నే ఎంచుకున్నా కానీ సినిమాను బాగానే చూశారు జనాలుఈ సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 2.02 TRP రేటింగ్ దక్కిందని సమాచారం. అసలు ఏమాత్రం ప్రమోషన్ చేయకున్నా కానీ సినిమా కి తెలుగు లో ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు అమ్మిన రేటు ప్రకారం చూసుకుంటే సాలిడ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

 

2.IPL టైంలో దుమ్ములేపే రేంజ్ లో TRP రేటింగ్ తో ప్రభుదేవ లక్ష్మీ మూవీ.!   

డాన్సర్, యాక్టర్, డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ ప్రభుదేవ ఒక పక్క బాలీవుడ్ మూవీస్ తో పాటు సౌత్ మూవీస్ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అన్నీ కూడా ఎక్కువగా డాన్స్ బేస్ మూవీస్ కాగా కొన్ని హర్రర్ కామెడీ మూవీస్ కూడా ఉన్నాయి, డాన్స్ బేస్ మూవీస్ లో రెండేళ్ళ క్రితం తమిళ్ అండ్ తెలుగు లో కలిపి ఒక సినిమా రిలీజ్ అవ్వగా ఆ సినిమా నుఎవ్వరూ పెద్దగా పట్టించుకోనే లేదు…. ఆ సినిమా నే లక్ష్మీ…. చిన్న పిల్లల సినిమా అంటూ ఎవ్వరూ పట్టించుకోని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఫ్లాఫ్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది, దాంతో తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ అసలు అమ్ముడు పోలేదు. కాగా సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 2 ఏళ్ల తర్వాత సినిమా ను జీ తెలుగు వాళ్ళు తక్కువ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. సుమారు 45 లక్షల ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవ్వగా ఎవరు పట్టించు కుంటారు లే అని అంతా లైట్ తీసుకున్నా కానీ సినిమా కి తెలుగు లో అల్టిమేట్ రేటింగ్ వచ్చింది అని చెప్పాలి, సినిమా కి పెట్టిన రేటు కి చేసిన ప్రమోషన్ కి ఇది బ్లాక్ బస్టర్ TRP రేటింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.6 TRP రేటింగ్ దక్కింది, IPL టైం లో పోటి గా ఇతర ఛానెల్స్ లో వేరే సినిమాలు టెలికాస్ట్ అవుతున్నా కానీ ఈ సినిమా కి ఇంత రేటింగ్ రావడం అది కూడా పెట్టిన రేటు చాలా తక్కువ అవ్వడం తో ఛానెల్ కి మొదటి సారే అల్టిమేట్ ప్రాఫిట్ ని సినిమా తీసుకు వచ్చింది అని చెప్పాలి.

3.థియేటర్స్ లో డిసాస్టర్..టెలివిజన్ లో డబుల్ డిసాస్టర్ అయిన కార్తిక్ మూవీ.!  

కొన్ని సార్లు పర్వాలేదు బాగుంది అన్న టాక్ వచ్చిన సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అవుతాయి, చాలా సార్లు మాత్రం అలా టాక్ తెచ్చు కున్నా కానీ కలెక్షన్స్ ని సాధించలేక ఫ్లాఫ్ గా మారు తాయిలాస్ట్ ఇయర్ ఖైదీ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న కార్తి రెండు నెలల గ్యాప్ లో దొంగ అనే మరో సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయిన ఈ సినిమా 3.5 కోట్ల బిజినెస్ కి కేవలం 1.86 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా తర్వాత ఈ సినిమాను జీ తెలుగు వాళ్ళు 1.6 కోట్ల రేంజ్ రేటు మాత్రమే చెల్లించి ఫ్యాన్సీ రేటు కి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగాసినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడే డిసాస్టర్ అనిపించే విధంగా కేవలం 3.44 TRP రేటింగ్ ని సాధించి షాక్ ఇవ్వగా రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అయిన సినిమా మరో సారి నిరాశ పరిచే రేటింగ్ ని అందుకుంది. సినిమా కి సెకెండ్ టెలికాస్ట్ టైం లో కేవలం 2.14 TRP రేటింగ్ మాత్రమే దక్కడం తో ఛానెల్ కి మొత్తం మీద లో రేటింగ్స్ వలన పెట్టిన డబ్బు చాలా తక్కువే అయినా రికవరీ అవ్వలేదని సమాచారం. దాంతో సినిమా టెలివిజన్ లో కూడా డిసాస్టర్ రన్ ని కొనసాగిస్తుండగాఛానెల్ ఇప్పుడు రికవరీ అవ్వాలి అంటే సినిమా మరో రెండు సార్లు మినిమమ్ టెలికాస్ట్ అయ్యి యాడ్స్ ని సాధిస్తేనే సాధ్యం అవుతుంది అంటున్నారు. కార్తి ఖైదీ కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయినా టెలివిజన్ లో లోవెస్ట్ రేటింగ్ ని అందుకోగా ఇప్పుడు ఈ సినిమా ఇంకా షాక్ ఇచ్చింది..

 

4.5 ఇయర్స్ ఓల్డ్ మూవీ..టెలివిజన్ లో అల్ రికార్డ్ ఇది!!

నారా రోహిత్ కెరీర్ లో చేసిన మంచి సినిమా లలో అసుర అనే సినిమా కూడా ఒకటి, హానెస్ట్ పోలిస్ ఆఫీసర్ రోల్ లో నటించి మెప్పించాడు నారా రోహిత్.. సినిమా కూడా డీసెంట్ గానే ఉంటుంది కానీ అప్పట్లో వరుస ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ ఈ సినిమా పై కూడా పడటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిరాశ పరిచి ఫ్లాఫ్ గా పరుగును ముగించాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్లకి టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, మధ్య వేసిన సినిమాలే వేస్తూ వస్తున్న స్టార్ మా ఆ రూట్ ని పక్కకు పెట్టి ఓల్డ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ అమ్మకుండా ఉన్నవి వెతికి ఎంతో కొంత రేటు చెల్లించి…. ఇప్పుడు ఆ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని సాధిస్తూ ఉండగా ఇప్పుడు అసుర సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత స్టార్ మా ఛానెల్ తక్కువ రేటు కే కొనగా లాస్ట్ వీక్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా షాకింగ్ లో TRP రేటింగ్ ని సాధించింది. సినిమా కి ఫస్ట్ టెలికాస్ట్ లో 2.29 TRP రేటింగ్ దక్కగా టాలీవుడ్ లో స్ట్రైట్ తెలుగు మూవీస్ పరంగా ఇది లోవేస్ట్ TRP రేటింగ్ లలో ఒకటి అని అంటున్నారు. 5 ఏళ్ల క్రితం మూవీ, పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు లాంటి ఎఫెక్ట్ లు ఉన్నా కానీ ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున లోవేస్ట్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి, ఇది వరకు లోవేస్ట్ TRP మూవీస్ లో డబ్బింగ్ మూవీస్ చెలియా 1.89 మరియు క్రైం 23 సినిమాలు 1.88 రేటింగ్స్ తో ఆల్ టైం లోవేస్ట్ లో ఉండగా స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా ఇప్పుడు అసుర సినిమా అతి తక్కువ రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

 

5.సెన్సేషనల్ TRP రేటింగ్తో కుమ్మేసిన 3rd వీక్ బిగ్ బాస్ - 4.!

తెలుగు టెలివిజన్ లో సూపర్ సక్సెస్ అయిన షో లలో బిగ్ బాస్ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన షో అనే చెప్పాలి, మొదటి సీజన్ డౌట్ పడితే ఎన్టీఆర్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉండటం తో సూపర్ సక్సెస్ గా సాగిన మొదటి సీజన్ తర్వాత రెండో సీజన్ గొడవలతో ఆర్మీ లతో దుమ్ము లేపింది, మూడో సీజన్ ఏ గొడవ లేకున్నా మంచి రేటింగ్స్ ని సాధించగా ఇప్పుడు 4 వ సీజన్ ఎలాంటి పోటి లేని టైం లో కాకుండా IPL కి రెండు వారాల ముందు స్టార్ట్ అవ్వగా అల్టిమేట్ రేటింగ్స్ తో దూసుకు పోతుంది, మొదటి వారం రికార్డు రేటింగ్స్ ని అందుకున్న షో రెండో వారం కూడా బాగానే హోల్డ్ చేసింది, ఇక మూడో వారం లో… IPL సీజన్ స్టార్ట్ అవ్వడం తో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది డౌట్ గా మారగా అందరికీ షాక్ ఇస్తూ IPL ఉన్నా కానీ రెండో వారం కన్నా బెటర్ రేటింగ్స్ ని మూడో వారం సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది బిగ్ బాస్ సీజన్ 4 మూడో వారం TRP రేటింగ్స్ మూడో వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 9.64 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి రికార్డ్ లెవల్ లో 13.6 TRP రేటింగ్ దక్కిందిఇవి IPL స్టార్ట్ అయిన రోజులు అయిన అల్టిమేట్ రేటింగ్స్ ని సాధించింది బిగ్ బాస్ తెలుగు 4…. ఇక మూడో వారం వర్కింగ్ డేస్ ఎపిసోడ్స్ కి మొత్తం మీద యావరేజ్ గా…. 8.68 TRP రేటింగ్ దక్కిందని సమాచారంఅంటే వర్కింగ్ డేస్ కి కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు IPL…. ఇక IPL మొదటి మ్యాచ్ కి తెలుగు లో TRP కూడా సాలిడ్ గా దక్కింది…18.55 మిలియన్స్ ఇంప్రెషన్స్ ని అంటేసింపుల్ గా TRP లెక్కల్లో 23 రేటింగ్ కి తగ్గని TRP ని సొంతం చేసుకుంది

 


6.విజిల్ తెలుగులోఅమ్మింది 4.2 కోట్లకు..5 వ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్.!  

డైరెక్ట్ తెలుగు సినిమా లకు కూడా TRP రేటింగ్ లు మొదటి సారి వచ్చిన దాని కన్నా తర్వాత తగ్గుతూ పోతుంటాయి, కొన్ని సినిమా లను మినహాయిస్తే చాలా సినిమా లకు ఇదే జరుగుతూ ఉంటుంది, కానీ కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ విజిల్ మాత్రం తెలుగు లో సాలిడ్ TRP రేటింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ దీపావళి కి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా తెలుగు లో కూడా విజయ్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము లేపింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసిన తర్వాత టెలివిజన్ లో కూడా రఫ్ఫాడిస్తుంది ఈ సినిమాసినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు విజయ్ ప్రీవియస్ మూవీస్ కన్నా కూడా బెటర్ రేటింగ్ ని సాధించగా తర్వాత టెలికాస్ట్ అయిన రెండో సారి మూడో సారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది విజిల్ సినిమా. ఇక నాలుగో సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా మొదటి సారి కన్నా ఎక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా 5 వ సారి కూడా టెలికాస్ట్ అవ్వగా IPL మ్యాచ్ అండ్ బిగ్ బాస్ ఎఫెక్ట్ ఉన్నా కానీ హోల్డ్ చేసి మరో సారి మంచి TRP రేటింగ్ ని సాధించి హోల్డ్ చేయడం విశేషం

మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్స్ ని గమనిస్తే
👉1st Time – 6.86 TRP
👉2nd Time – 5.10 TRP
👉3rd Time- 6.87 TRP
👉4th Time- 7.18 TRP
👉5th Time- 4.86 TRP***
సినిమా ను 4.2 కోట్లకు పైగా రేటు చెల్లించి కొన్న జెమినీ టీవీ కి సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కించి పెడుతుంది ఈ సినిమా..

 


7.నాగశౌర్య మూవీ అక్కడ డిసాస్టర్..ఇక్కడ 3 టైం బ్లాక్ బస్టర్..!   

ఛలో తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత మళ్ళీ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అనుకున్న రేంజ్ విజయాలు దక్కడం లేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరుస్తూ రాగా తన హోమ్ బ్యానర్ లో తానె కథ ని అందించి చేసిన లేటెస్ట్ మూవీఅశ్వథ్థామఈ ఇయర్ సంక్రాంతి తర్వాత రిలీజ్ అవ్వగా సినిమా కి

పర్వాలేదు అనే టాక్ వచ్చినా కానీ సంక్రాంతి సినిమాల జోరు వలన సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 7.2 కోట్ల టార్గెట్ కి 4.8 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసిన సినిమా నష్టాలు గట్టిగానే మిగిలించినా టెలివిజన్ శాటిలైట్ రైట్స్ మాత్రం సినిమా కి 3.15 కోట్ల రేంజ్ లో దక్కగా నిర్మాత సేఫ్ అయ్యాడు.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా కానీ టెలివిజన్ లో మాత్రం సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది అని చెప్పాలి.అశ్వథ్థామమొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 9.10 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా ఫస్ట్ టైం కుమ్మేసిన తర్వాత సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమా కి రెండో సారి కొంచం తగ్గినా 5.41 TRP రేటింగ్ తో బాగానే హోల్డ్ చేసింది. ఇక సినిమా IPL స్టార్ట్ అయిన తర్వాత మూడో సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి రెండో సారి కన్నా ఎక్కువ TRP రేటింగ్ రావడం విశేషం అనే చెప్పాలి

సినిమా కి మూడో టెలికాస్ట్ లో 5.61 TRP రేటింగ్ దక్కి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేయగా ఛానెల్ కి మొత్తం మీద సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కేలా చేసిన అశ్వథ్థామబాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా బుల్లి తెరపై మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి.


8.థియేటర్స్ లో డబుల్ డిసాస్టర్..టెలివిజన్ ఎపిక్ బ్లాక్ బస్టర్.!

IPL మొదలైంది ఇక టెలివిజన్ షోలు, సీరియల్స్, సినిమాలను ఎవ్వరూ పెద్దగా పట్టించు కోరు అని అంతా అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు అని లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అన్ని సినిమాల TRP రేటింగ్ రిపోర్ట్ లు చూస్తె అర్ధం అవుతుంది, ఇక లాస్ట్ వీక్ మూవీస్ లో ఇప్పటికే టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సాలిడ్ రేటింగ్ తో కుమ్మేసిన వినయ విదేయ రామ సినిమా మరోసారి అల్టిమేట్ రేటింగ్ తో హోల్డ్ చేసి లాంగ్ రన్ క బ్లాక్ బస్టర్ అని టెలివిజన్ లో నిరూపించుకుందిసినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది, టెలివిజన్ లో కొన్న రేటు ప్రకారం కూడా డిసాస్టర్ రేటింగ్ ని సాధించింది అని…. విమర్శలను ఎదురుకున్నా కానీ తర్వాత లాంగ్ రన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ రేటింగ్ తో దుమ్ము లేపగాఇక లాస్ట్ వీక్ కూడా టెలికాస్ట్ చేయగా ఈ సారి IPL స్టార్ట్ అవ్వడం తో TRP దెబ్బ పడటం గ్యారెంటీ అని అంతా భావించారు కానీ అలా జరగలేదు సినిమా 13 వ సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా హోల్డ్ చేసి 5.12 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. IPL మ్యాచ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ సాలిడ్ గా హోల్డ్ చేయడం విశేషం అనే చెప్పాలిఒకసారి సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినప్పుడు వచ్చిన రేటింగ్స్ ని గమనిస్తే

1st time –7.9 TRP రేటింగ్
2nd time – 8.2 TRP రేటింగ్
3rd time – 8.16 TRP రేటింగ్
4th time – 7.2 TRP రేటింగ్
5th time – 8.18 TRP రేటింగ్
6th time – 5.19 TRP రేటింగ్
7th time – 6.35 TRP రేటింగ్
8th time – 7.97 TRP రేటింగ్
9th time – 7.55 TRP రేటింగ్
10th time – 7.51 TRP రేటింగ్
11th time – 7.68 TRP రేటింగ్
12th time – 5.98 TRP రేటింగ్
13th time- 5.12 TRP రేటింగ్
ఇలా టెలికాస్ట్ చేసిన ప్రతీసారి కుమ్మేస్తున్న ఈ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్టెలివిజన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి

 

9.ఆ ఇద్దరి హీరొయిన్స్ కి ఒకే చెప్పిన రవితేజ..!  

మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన తరువాత వరుస సినిమాలు ఫ్లోప్ కావడం ఇక భారీ అంచనాలతో విడుదల అయిన డిస్కో రాజా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు.

డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో క్రాక్అనే మాస్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. ఇక దీని తర్వాత రవితేజ మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు రమేష్ వర్మ తో ప్లాన్ చేసిన మూవీ కూడా ఒకటి.

పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను దర్శకుడు లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ నిధి అగర్వాల్ మరియు అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈ అక్టోబర్ మూడో వారంలో మొదలుకానుంది అని సమాచారం.

 

10.విజయ్ మాస్టర్ మూవీకి అప్పుడే మోక్షం.?     

కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ థలపతి విజయ్ కు ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. సర్కార్”, “విజిల్సినిమాలతో తెలుగు సినిమా లవర్స్ కు కూడా మంచి దగ్గరైన థలపతి విజయ్ ఇపుడు నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ తో కూడా రెడీగా ఉన్నాడు.  

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిరుధ్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది. పైగా ఇంకా ఎలాంటి టీజర్ కూడా రాకుండానే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదల కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.  

మధ్యలో భారీ ఓటిటి డీల్స్ వచ్చినా ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని గట్టి డిమాండ్ చెయ్యడం మేకర్స్ కూడా మొగ్గు చూపకపోవడంతో ఈ సినిమా థియేట్రికల్ విడుదల కే స్టిక్ అయ్యింది. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో మాస్టర్ మూవీ కి డేట్ ఫిక్స్ అయింది అని సమచారం.కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారు అని టాక్.