ఎవరు మీలో కోటీశ్వరులు
5th వీక్ TRP రేటింగ్.!తగ్గేదేలే.!  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు, ఆల్ రెడీ పాతాళానికి పడిపోయిన ఈ షో ని టేక్ ఆఫ్ చేయడమే పెద్ద విషయం అంటే నాన్ స్టాప్ గా మూడు వారాల పాటు అద్బుతమైన రేటింగ్ లతో ఈ షో ను నిలబెట్టాడు ఎన్టీఆర్, కానీ ప్రశ్న జవాబుల తోనే సరిపెట్టుకునే ఈ షో కన్నా ఎంటర్ టైన్ మెంట్ ని అందించే ఇతర షోలు చాలానే

పోటి లో ఉండటం లాంటివి లాంగ్ రన్ లో రేటింగ్ ల పై ఇంపాక్ట్ చూపుతున్నాయి, దాంతో రేటింగ్ లు తగ్గాయి, లేటెస్ట్ గా 4 వ వారం తో పోల్చితే 5 వ వారం రేటింగ్ లలో మరింత డ్రాప్ కనిపించింది, ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో, రెండో వారంలో 6.48 రేటింగ్ ను దక్కించుకుంది. ఇక మూడో వారంలో రెట్టించిన జోరు చూపెట్టిన ఈ షో ఏకంగా 7.3 రేటింగ్ తో దుమ్ము లేపగా నాలుగో వారం లో 6.59 రేటింగ్ ఓవరాల్ గా సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది కానీ కొంచం తగ్గింది.

ఇక ఇప్పుడు 5 వ వారం విషయానికి వస్తే రేటింగ్ మరింత తగ్గి 4.7 రేటింగ్ ను 5 వ వారం యావరేజ్ గా సొంతం చేసుకుంది ఈ షో, అంటే ఆల్ మోస్ట్ 2 రేటింగ్ పాయింట్స్ ని ఒక్క వారంలో కోల్పోయింది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే 5 వ వారం ఓవరాల్ గా అన్ని సీజన్స్ లో ఇదే బెస్ట్ హోల్డ్ అని విశ్లేషకులు చెబుతూ ఉండటం విశేషం.

 

 

 

 

అఖండ సినిమాలో ఒక్క పాత్ర కోసం 40 గెటప్స్ ట్రై చేశారట.!

నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లోరూపొందుతున్న అఖండ సినిమా లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. గతంలో బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా లో జగపతిబాబు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి సూపర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.

 ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా తో శ్రీకాంత్ విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీకాంత్ పై సన్నివేశాల చిత్రీకరణ ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు ఆయన పాత్ర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

రీసెంట్ గా ఇచ్చిన ఒక్క చిన్న ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అఖండ సినిమాలో నా పాత్ర కోసం 40  గెటప్స్ ను ట్రై చేయడం జరిగింది. ముంబయికి చెందిన ప్రముఖ డిజైనర్ మరియు ఆర్టిస్టులను అందుకోసం రంగంలోకి దించారు. 40 గెటప్స్ ను పరిశీలించిన తర్వాత చివరగా ఒక గెటప్ ను ఖరారు చేశారు అన్నాడు. సినిమా విడుదల అయ్యే వరకు తన గెటప్ ను రివీల్ కాకుండా సస్పెన్స్ గా ఉంచాలని దర్శకుడు భావిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

 

 

 

 

రాజమౌళి కోసం మహేష్ మరోసారి త్యాగం చేయబోతున్నారా..?

బాహుబలి 2 సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్ లను వసూలుచేసి అల్ టైం హిట్ ని అందుకున్న S.S.రాజమౌళి.ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కావలిసింది.3rd వేవ్ వల్ల సినిమా ని పోస్టర్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలి అని ప్లన్ చేసుకుంటున్నారు.

ఇక సంక్రాంతి పండగ కి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటా సినిమా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని జనవరి 14న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

అయితే ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ RRR సినిమా జనవరి 14 న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు.దాంతో జనవరి 14న విడుదల కావలిసిన మహేష్ బాబు సినిమా ఒక్క రోజు ఆలస్యంగా విడుదల కానుంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.