ఆచార్య
సినిమాలో రామ్ చరణ్ నిడివి ఎంతో తెలిస్తే షాకే.??
మెగా స్టార్ చిరంజీవి
ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన
దగ్గర నుంచి తన దూకుడు పెంచారు. వరుసగా స్టొరీ లను వింటూ .. వాటిని ఓకే చేస్తూ
ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా
చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో
మరో ముక్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.రామ్ చరణ్ కి
జోడిగా పూజ హెగ్డే హీరొయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్
ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 46 నిమిషాల
వరుకు ఉంటుంది అని సమచారం.ఈ 46 నిమిషాలు మెగాస్టార్,రామ్ చరణ్ కి మద్య వచ్చే సీన్
సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది అని సమచారం.
చిరంజీవితో
రవితేజ్ సినిమా.!!
మెగాస్టార్
చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఫుల్ జోష్ మీద
వరుసా సినిమాలను చూస్తే దూసుకుపోతున్నాడు.ఫస్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే
సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత వరుసగా నాలుగు సినిమాలో అనౌన్స్ చేసిన
మెగాస్టార్.అందులో ఒక్కటి బాబీ దర్శకత్వం ఒక్క సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకి 'వాల్తేర్
వీర్రాజు' అనే టైటిల్ పెట్టాలి అన్ని దర్శకనిర్మాతలు
ఆలోచిస్తున్నారు.ఇక ఈ సినిమా సముద్ర తీర
ప్రాంతంలోని జాలరుల జీవితాల నేపథ్యంలో ఈ స్టొరీ సాగనున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ
సినిమా తొలి షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేసినట్టుగా సమచారం.
అయితే ఈ సినిమా
నుండి మరో ఆసక్తికరమైన న్యూస్ అనేది బయటకువచ్చింది.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర
కోసం మాస్ మహారాజా రవితేజ ను అడిగారు అన్ని సమచారం.రవితేజ్ కూడా మెగాస్టార్ సినిమా
అన్ని వెంటనే ఒకే చెప్పాడు ఆని తెలుస్తుంది.తవరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్
రానుంది.
రిపబ్లిక్ మూవీ టోటల్ రన్ టైం.!!నైజాం థియేటర్స్ కౌంట్!!
సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫుల తర్వాత బాక్ టు బాక్ హిట్స్ తో జోరు చూపాడు, చిత్రలహరి మరియు ప్రతీ రోజూ పండగే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన విజయాలుగా నిలవగా తర్వాత చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఫస్ట్ వేవ్ తర్వాత ఇండియా లో ఫస్ట్ క్లీన్ హిట్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది.
ఈ సినిమా తరువాత సాయి ధరం తేజ్ చేసిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా టోటల్ లెంత్ 2 గంటల 32 నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇక సినిమా కి నైజాం లో సాలిడ్ గానే థియేటర్స్ ని కేటాయించారు ఇప్పుడు, ఊర్లలో 135 థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా
సిటీలలో ఆల్ మోస్ట్ 85 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, దాంతో ఒక్క నైజాంలోనే సుమారు 220 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక టోటల్ థియేటర్స్ కౌంట్ వివరాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది..
రిపబ్లిక్
మూవీ టోటల్ బిజినెస్..!హిట్ అవలింటే ఎంత వసూల్ చేయలింటే.?
సాయి ధరం తేజ్ ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…. కాగా సినిమా రిలీజ్ కోసం మెగా హీరోలు అందరూ తమ వంతుగా సినిమాను ప్రమోట్ చేశారు, ట్రేడ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది, కానీ ప్రస్తుతం ఆడియన్స్ లో సినిమా పై…
అంత బజ్ ఉందా లేదా
అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓపెనింగ్స్ తో తెలుస్తుంది అని చెప్పాలి. ఇక సినిమా
బిజినెస్ ను గమనిస్తే… సినిమాను
నైజాం ఏరియాలో
4.5 కోట్ల రేటు కి
అమ్మారు. ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో 5.8 కోట్ల రేటు కి అమ్మగా…
సీడెడ్ ఏరియాలో 2.5
కోట్ల రేటు కి
అమ్మారు… దాంతో
తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 12.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా కి సీడెడ్ లో బిజినెస్
అందుకొక పొతే 50 లక్షలు
వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఇక
ఆంధ్రలో బిజినెస్
అందుకోక పొతే 1.1 కోట్ల
దాకా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది….
అన్న అగ్రిమెంట్ తో
సినిమాను అమ్మారని సమాచారం… ఇక
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లు కలిపి మరో 80 లక్షల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్
వరల్డ్ వైడ్ గా 13.6 కోట్ల
ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది, దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర
సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి…
ఓవరాల్ గా ఈ బిజినెస్
సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కన్నా ఎక్కువే జరిగింది ఇప్పుడు. కానీ
సినిమాను చూడటానికి జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారు బాక్స్ ఆఫీస్
దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని
చెప్పాలి.
RC15 బడ్జెట్ నియంత్రణపై శంకర్ ను ఒప్పించిన దిల్ రాజు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఇది చరణ్ కెరీర్ లో 15వ చిత్రం.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం. అందుకే ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్రొడక్షన్ లో అత్యధిక బడ్జెట్ లో తీసే ప్రాజెక్ట్ గా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందే #RC15 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు. దీని కోసం దర్శకుడు శంకర్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ అడిగారని ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాని అంతకంటే తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసేలా శంకర్ ని ఒప్పించారట. ఈ ప్రాజెక్ట్ ని 170 కోట్లలో తీసిచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారట. అయినప్పటికీ ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న అత్యధిక బడ్జెట్ సినిమా అనే చెప్పాలి
RC15 చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులుగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తమిళ నటుడు ప్రభు ని కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. జానీ మాస్టర్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
RC15 చిత్రంతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని శంకర్ చూస్తున్నారు. 'స్నేహితుడు' 'ఐ' '2.0' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దర్శకుడి స్థాయికి తగ్గ వసూళ్ళు రాకపోవడం.. 'ఇండియన్' సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టి ఆగిపోవడంతో.. శంకర్ ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కసి మీదున్నాడు. మరోవైపు చరణ్ సైతం.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించాలనుకున్న డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ అవ్వడంతో హ్యాపీగా ఉన్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది తండ్రీ కొడుకులు కలిసి చేస్తున్న మొదటి పూర్తి స్థాయి సినిమా. ఓ సాంగ్ మినహా ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే జనవరి నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్న చెర్రీ.. ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.