శంకర్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.!!హీరో ఎవరంటే?
ఓవైపు టాలీవుడ్ క్రేజీ సినిమాని ప్రారంభిస్తున్న శంకర్ కి సూర్య గుడ్ న్యూస్ అందించారు. హీరో సూర్య తన తదుపరి సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు.
సినీ చరిత్రలోనే
సినిమా విడుదలల్లో కొత్త ప్రయోగం.!!
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తుగ్లక్ దర్భార్
అనే సినిమా అక్కడ ముందుగా సన్ టీవీలో ప్రసారం అవుతోంది.
థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడం లేదు. తొలి రోజే టీవీలో ప్రసారం కాబోతోంది. ఆ
తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచుతారట.
ప్రేక్షకులను
భయపెడుతున్న చైతూ.!
విశ్వసనీయంగా
అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు త్వరలో
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ ను చేయబోతున్నాడట. అది హర్రర్ కాన్సెప్ట్
అంటున్నారు. విక్రమ్ కుమార్ ఇప్పటికే 13 బి అనే హర్రర్ మూవీని
ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. తమిళంలో వచ్చిన ఆ సినిమా అన్ని
భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించింది.
ఈ వారం
పోటీ మాములుగా లేదు.!!
ఈ వారమే ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. అయితే అదే రోజున థియేటర్లలో ‘సీటీమార్’ సినిమా సందడి చేయబోతుంది. ఈ వారంలో
విడుదలయ్యే పేరున్న సినిమాలు ఇవే. ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనడం కంటే.. థియేటర్ ఓటీటీ
మధ్య పోటీ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. ‘టక్ జగదీష్’ ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది. నాని సినిమా
అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.
మహేష్
బాబుతో చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరొయిన్.?
ఏకంగా సూపర్
స్టార్ మహేష్ బాబు చిత్రంతో టాప్ లీగ్‌లోకి వెళ్లే ఛాన్స్ వచ్చినట్లు తాజా సమాచారం.
సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నభా
సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో
పూజా హెగ్డే లీడ్ హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఇప్పటికే
అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఐతే త్రివిక్రమ్ సినిమాల్లో చాలా వరకు
రెండో హీరోయిన్ పాత్ర ఉంటుంది. హీరోకు జోడీగా నటించకపోయినా.. స్పెషల్
క్యారెక్టర్లో మరో అందమైన భామను ఆకర్షణ కోసం పెడుతుంటాడు. ఈ సెంటిమెంటును మహేష్
సినిమాకు కూడా కొనసాగించనున్నాడని.. ఆ పాత్రలోనే నభా నటించబోతోందని
అంటున్నారు.