బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత బుల్లితెరపై మళ్ళీ ఎన్టీఆర్ కనిపించలేదుఆల్ మోస్ట్ 4 ఏళ్ల తర్వాత ఆల్ రెడీ పాతాళానికి పడిపోయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ని పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు గా హోస్ట్ చేయడానికి ఒప్పుకున్న ఎన్టీఆర్ మొదటి ఎపిసోడ్ లో తన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కలిసి నటిస్తున్న మరో హీరో రామ్ చరణ్ తో ఫస్ట్ ఎపిసోడ్ ని హోస్ట్ చేశారు

కాగా ఈ మొదటి ఎపిసోడ్ కి ఓవరాల్ గా టోటల్ సీజన్స్ అన్నింటిలోకి కూడా అత్యధిక రేటింగ్ దక్కింది. ఫస్ట్ ఎపిసోడ్ కి మొత్తం మీద 11.4 TRP రేటింగ్ దక్కడం విశేషం, టోటల్ సీజన్స్ అన్నింటిలోకి కూడా ఇది అత్యధికమైన రేటింగ్ గా చెప్పుకోవచ్చు

ఒకసారి టోటల్ సీజన్స్ ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ లను గమనిస్తే
#meeloevarukoteeswarudu (Season1) – 9.7 TVR
#meeloevarukoteeswarudu (Season2) – 8.2 TVR
#meeloevarukoteeswarudu (Season3) – 6.72 TVR
#meeloevarukoteeswarudu (Season4) – 3.62 TRP
#evarumeelokoteeswarulu (Season5) – 11.4 TRP
ఆల్ మోస్ట్ పాతాళానికి పడిపోయిన షో కి ఆల్ మోస్ట్ 3 రెట్లు అధికంగా రేటింగ్ రావడం విశేషం అని చెప్పాలి.

ఇక మొదటి వారం వర్కింగ్ డేస్ విషయానికి వస్తే సీజన్ 1 కి 4.55 రేటింగ్ రాగా, సీజన్ 2 కి 4.2 రేటింగ్ దక్కింది, సీజన్ 3 కి 3.1 రేటింగ్ సొంతం అవ్వగా సీజన్ 4 కి 2.4 రేటింగ్ తో పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ సీజన్ 5 వర్కింగ్ డేస్ కి గాను 5.62 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సీజన్ 5…

సినిమాలు తప్ప షోల పరంగా కంప్లీట్ డౌన్ ఫాల్ లో ఉన్న జెమినీ టీవీ కి తిరిగి ఊపిరి పోస్తూ రేటింగ్ లను తెప్పిస్తూ తిరిగి గాడిలో పడేలా చేస్తుంది అని చెప్పాలి. ఇక అప్ కమింగ్ వీక్స్ లో ఈ షో ఎలాంటి రేటింగ్ లతో హోల్డ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పొచ్చు.