తెలుగు టీవీ చరిత్రలోనే నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రతీ సారి ఈ షో రికార్డు వ్యూయర్ షిప్ తో దేశంలోని అన్ని భాషల్లోని బిగ్ బాస్ లను మించి పోతుంది. నాలుగేళ్ల కిందట ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ సీజన్ల వారిగా విజయవంతం అవుతూనే ఉంది. హోస్ట్ లు మారుతూ మరింత రక్తికడుతూ ముందుకు సాగింది. ప్రేక్షకుల అంచనాలకు మించి చాలామందిని సెలబ్రెటీలను చేసి షో పాపులర్ అయ్యింది. షోలో సెలబ్రెటీలు లేకున్నా ఆదరణ ఏమీ తగ్గకుండా ముందుకు సాగింది.యూత్ కుటుంబ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
గత ఏడాది కరోనా దెబ్బ పడ్డా
కూడా షో ఆగలేదు. లేటుగా అయినా షో మొదలై మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ ఏడాది
కూడా కరోనా ప్రభావం పడి కొంచెం లేటుగా ప్రారంభమవుతోంది.
ఈ ఆదివారం నుంచి ఐదో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఐతే షో మొదలు కానుండగా ఎప్పుడూ ఉండే హడావుడి మాత్రం ఈసారి కనిపించడం లేదు.
బిగ్
బాస్ కు ప్రతీ ఏటా హైప్ తెచ్చేది పార్టిసిపెంట్లే. ఆ రూమర్లతోనే షో
రక్తికట్టేది. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ సాగేది. ఫలానా
ఆర్టిస్ట్ ఆ యూట్యూబర్ ఆ టిక్ టాక్ స్టార్ ఫలానా సినీ సెలబ్రెటీ అంటూ
పార్టిసిపెంట్ల గురించి ఊహాగానాలు నడిచేవి. సోషల్ మీడియాలో ఈ రచ్చ బాగా
జరిగేది.
అయితే ఈసారి మాత్రం అలాంటి చర్చలు ఊహాగానాలు పెద్దగా రావడం
లేదు. కొన్ని వారాల ముందు సురేఖ వాణి షణ్ముఖ్ లాంటి వారి పేర్లు
ప్రచారమయ్యాయి. ఆ తర్వాత ఈ చర్చ ఆగిపోయింది. షో మరో మూడు రోజుల్లో
మొదలవుతున్నా కూడా అసలు పార్టిసిపెంట్ల గురించి చర్చ కానీ.. ఆసక్తి కానీ..
హడావుడి కానీ ఈసారి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే షో మొదలయ్యాక
పరిస్థితి ఇలా ఉండకపోవచ్చని అంటున్నారు. ఆదరణకు ఢోకా లేకపోవచ్చమో అన్న టాక్
కూడా నడుస్తోంది.