ఇప్పటి దాకా ఒక లెక్క..ఇప్పటినుంచి ఒక లెక్క..!!
ఇది ఎంతవరకు
నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఒకవేళ కనుక నిజం అయితే కచ్చితంగా ఫ్యాన్స్
కి పూనకాలు ఖాయం అనే చెప్పాలి… ఇండియా లోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్…
ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్
స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అజయ్ దేవగన్, ఆలియా భట్
లాంటి బాలీవుడ్ స్టార్స్ కలిసి…
చేస్తున్న ఈ
సెన్సేషనల్ మూవీ జనవరి 7 న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా
సినిమాలో ఇప్పటికే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రో టీసర్ లు రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్
రామ్ చరణ్ ల ఇంట్రో టీసర్స్ సంచలన రికార్డులు నమోదు చేశాయి.
కానీ
ఫ్యాన్స్ ఎక్కడో ఆశ… సినిమా మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు కూడా వస్తాయి అని…. ఇప్పుడు ఇదే నిజం అవుతుంది అంటూ రెండు మూడు రోజులుగా టాలీవుడ్ లో సినిమా
అఫీషియల్ టీసర్ ఈ నెల 29 న రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు
జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
ఇవి ఎంతవరకు
నిజం అనేది ఇంకా తెలియలేదు కానీ మేకర్స్ అయితే ఇప్పటి వరకు అయితే నో అని కూడా
చెప్పలేదు. దాంతో ఇది కనుక నిజం అయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అదే టైం లో
ఇండియా లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీసర్ లలో 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ని సొంతం
చేసుకున్న KGF చాప్టర్ 2 టీసర్
రికార్డులను…
సవాల్ చేసే
సత్తా ఆర్ ఆర్ ఆర్ కే ఇప్పుడు ఉంది కాబట్టి ఒకవేళ వస్తే కచ్చితంగా 24 గంటల రికార్డ్ ను బ్రేక్
చేయడానికి ఆర్ ఆర్ ఆర్ కి ఎంతైనా అవకాశం ఉందని చెప్పోచ్చు. మరి ఇది నిజం అవుతుందో
కాదో త్వరలోనే తెలియబోతుంది. సినిమా మాత్రం ఆడియన్స్ ముందుకు జనవరి 7న పక్కాగా రాబోతుంది అన్నది మాత్రం ఖాయం.
వరుడు కావలెను ఫస్ట్ టాక్…సెన్సార్ డీటైల్స్
అండ్ రిపోర్ట్!
బాక్స్ ఆఫీస్
దగ్గర ఛలో సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత
మళ్ళీ అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల
కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వరుడు కావలెను… రీసెంట్ టైం లో వచ్చిన నాగ
శౌర్య మూవీస్ లో ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ
నెల 29న రిలీజ్ కానుండగా…
రీసెంట్ గా
సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని అక్కడ నుండి U/A సర్టిఫికేట్ ను సొంతం
చేసుకోగా టోటల్ రన్ టైం 2 గంటల 13 నిమిషాల వరకు ఉందని సమాచారం. ఇక సెన్సార్ రిపోర్ట్ చాలా వరకు పాజిటివ్
గానే వినిపిస్తుంది ఈ సినిమా విషయం లో…
ఓవరాల్ గా
ఇనీషియల్ టాక్ అక్కడ నుండి పాజిటివ్ గా ఉండగా ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ బాగా
ఉంటుందని, లీడ్
పెయిర్ మధ్య సీన్స్ ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ కామెడీ బాగా ఆకట్టుకుందని
అంటున్నారు. ఇక సెకెండ్ ఆఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ నుండి….
ఎమోషనల్ టచ్
తో సీన్స్ ఉంటాయని, ముఖ్యంగా నదియా మరి రితు వర్మల సీన్స్ బాగా వచ్చాయని, క్లైమాక్స్ కూడా ఎమోషనల్ టచ్ తో ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఎంటర్
టైన్ మెంట్ తో మొదలై ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుందని
అంటున్నారు… సాంగ్స్ బాగుండటం ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా
కి మరింత ప్లస్ పాయింట్ అని అంటున్నారు….
మొత్తం మీద
సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉన్నా ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ ఆడియన్స్ ఎంత వరకు
ఓన్ చేసుకుంటారో చూడాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్
అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా ఆల్ మోస్ట్ 180 లోకేషన్స్ లో రిలీజ్ కి
సిద్ధం అవుతుంది, ఇక సినిమా సెన్సార్ కి వినిపించిన రేంజ్
టాక్ రిలీజ్ అయ్యాక కామన్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్
దగ్గర నాగశౌర్య హిట్టు కొట్టే అవకాశం ఉంటుంది…
బాలయ్య 'ఆహా' షో
ఫస్ట్ గెస్ట్ ఈయనే
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా
ఆహాలో దీపావళి నుండి స్ట్రీమింగ్ కాబోతున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో మొదటి గెస్ట్
ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది. గతంలోనే మనం చర్చించినట్లుగా బాలయ్య షో
మొదటి గెస్ట్ గా మంచు హీరో మోహన్ బాబు హాజరు అవ్వబోతున్నాడు. ఇటీవలే అందుకు
సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. ఆహా అన్ స్టాపబుల్ సెట్ లో బాలయ్యతో
కలిసి మోహన్ బాబు ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. ఒకటి రెండు
రోజుల్లో టీజర్ మరియు మోహన్ బాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేస్తారనే
సమాచారం అందుతోంది.
బాలకృష్ణ మరియు మోహన్ బాబులు
ఇద్దరు ఇద్దరే. ఇలాంటి టాక్ షోల్లో ఇద్దరు కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
అలాంటిది బాలయ్య హోస్ట్ గా మోహన్ బాబు గెస్ట్ గా మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడం
అందరికి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా
ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లను చూడటం జరిగింది. ఎన్నో
సెలబ్రెటీల ఇంటర్వ్యూలను చూశాం. కాని బాలయ్య టాక్ షో అనగానే ఒక రకమైనా ఆసక్తి.. ఒక
రకమైన ఆతృత జనాల్లో కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తామా అంటూ
అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.
“రాధే శ్యామ్” నుంచి మరో ట్రీట్ రెడీ అవుతోందా.?
పాన్ ఇండియా
స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన
బిగ్గెస్ట్ పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. ఎనలేని
అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే ఓ గ్రాండ్ టీజర్ కట్ ని కూడా రిలీజ్
చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇంకో
ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమా పై వినిపిస్తోంది.