స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్.. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్,సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.



ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్న 'పుష్ప' టీమ్.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్.. దసరా సందర్భంగా వచ్చిన 'శ్రీవల్లి' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూడో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ''సామీ సామీ'' అనే పాటను అక్టోబర్ 28న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమో ని విడుదల చేసారు ఈ ప్రోమో కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఫుల్ సాంగ్ విడుదల అయితే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో మారి.