చరణ్-శంకర్ ప్రాజెక్ట్‌లోకి మరో పవర్ఫుల్ విలన్..!

మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పూణేలో జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ నటుడు సురేశ్ గోపీ నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుందని, ఆ పాత్రకు సురేశ్ గోపీ అయితే సరిగ్గా సెట్ అవుతాడని దర్శకుడు శంకర్ ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే కాకుండా ఈ సినిమాలో సురేశ్‌ గోపి భార్యగా ఇషాగుప్తా నటించనున్నారని, ఆమెది కూడా నెగెటివ్‌ రోల్‌ అనే తెలుస్తుంది.

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సినిమా సర్కారు వారి పాటకోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్ళీ పాత మహేష్ బాబుని చూడబోతున్నాం అనేదే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతూ వస్తుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చిన టీజర్ ను చిత్ర యూనిట్ మహేష్ బర్త్ డే కి బ్లాస్టర్ పేరిట రిలీజ్ చెయ్యగా దీనికి భారీ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసి భారీ వ్యూస్ ని కొల్లగొట్టింది.

మరి ఈ బ్లాస్టర్ రెస్పాన్స్ అక్కడితో ఆగలేదు ఇప్పుడు మరో మాస్ మైల్ స్టోన్ 40 మిలియన్ వ్యూస్ అందుకొని సాలిడ్ రికార్డు సెట్ చేసింది. మొత్తానికి మాత్రం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అనేదానికి ఇది శాంపిల్ అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

 

 

తనదైన నటనతో, డైలాగులతో వెండి తెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో అన్ స్టాపబుల్అనే టాక్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ టాక్ షో ప్రోమోను చిత్రీకరించారు.

అయితే ఈ ప్రోమో ఎలా ఎలా ఉండబోతుంది? ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని బుల్లితెర మరియు బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ప్రోమోకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు సాయంత్రం 05:10 నిమిషాలకు ఈ టాక్ షో ప్రోమో రిలీజ్ కాబోతుంది. మరీ ఈ టాక్ షోలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు, ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది రేపటితో ఓ క్లారిటీ రానుంది.