వరుడు కావలెను రివ్యూ.!!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ నాగ శౌర్య, రీతూ వర్మలు నటించిన లేటెస్ట్ సినిమా వరుడు కావలెను”. లక్ష్మి సౌజన్య తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ బజ్ ప్రమోషన్స్ నడుమ ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుంటుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. భూమి(రీతూ వర్మ) తన పర్సనల్ లైఫ్ పరంగా చాలా పర్టిక్యులర్ గా క్లారిటీ గా ఉండే మహిళ. అలానే పెళ్లి విషయంలో కూడా పెద్దగా ఆసక్తిగా ఆమె ఉండదు. మరి ఆమె కంపెనీలోకి ఓ ఆర్కిటిక్ గా ఆకాష్(నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఇక ఇక్కడ నుంచి ఈ ఇద్దరికీ ఎలా రిలేషన్ కుదురుతుంది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్ ని ఇష్టపడుతుందా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటుందా? అసలు తాను పెళ్లి చేసుకోకూడదు అని ఎందుకు బలంగా ఫిక్స్ అవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని  వెండి తెరపై చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే:  నాగ‌శౌర్య, రీతూ వ‌ర్మ అందంగా క‌నిపించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, ప‌లికించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రల‌కి స‌రైన ఎంపిక అనిపిస్తారు నాయ‌కానాయిక‌లు. విరామానికి ముందు, క్లైమాక్స్‌కి ముందు స‌న్నివేశాల్లో ఆ ఇద్దరి న‌ట‌న హత్తుకుంటుంది. పాట‌ల్లోనూ ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ అల‌రించింది. స‌ప్తగిరి, వెన్నెల కిషోర్‌, హిమ‌జ, ప్రవీణ్ త‌దిత‌రులు న‌వ్వించే బాధ్యత‌ని తీసుకున్నారు. ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా క‌థానాయిక త‌ల్లిదండ్రులుగా చ‌క్కటి పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వంశీ ప‌చ్చిపులుసు కెమెరా ప‌నిత‌నం, త‌మ‌న్‌, విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం ఆక‌ట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. గ‌ణేశ్ రావూరి మాట‌ల్లో మెరుపు క‌నిపిస్తుంది. ద‌ర్శకురాలు ల‌క్ష్మీసౌజ‌న్యకి ఇదే తొలి చిత్రమైనా ఎంతో ప‌రిణ‌తితో స‌న్నివేశాల్ని తెర‌పైకి తీసుకొచ్చారు.

ప్లస్ పాయింట్
+
కుటుంబ వినోదం

నాగ‌శౌర్య‌, రీతూ జోడీ

ద్వితీయార్ధంలో కామెడీ

పాట‌లు

+కంమేడి

మైనస్ పాయింట్

- కొన్ని సీన్స్ ఓవర్ లెత్  

-కొన్ని సీన్స్ మనం ముందుగానే ఎక్స్పోర్ట్ చేయవచ్చు.

-రొటీన్ clmks

చివరి గా : -  స్టార్ కాస్ట్, నాగశౌర్య- రితు వర్మల పెర్ఫార్మెన్స్, డీసెంట్ కామెడీ సీన్స్, మ్యూజిక్, క్లీన్ ఫ్యామిలీ స్టొరీ లాంటివి ఉండటం సినిమా ప్లస్ పాయింట్స్ కాగా కథ బలంగా లేక పోవడం, స్కీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం లాంటివి సినిమా మేజర్ మైనస్ పాయింట్స్అయినా కానీ సినిమా ఫ్యామిలీ  ఆడియన్స్ కి,యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందిమొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….