ఇంత భీభత్సం సృష్టించి..జస్ట్ 83 వేలతో ఆ రికార్డ్ మిస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ RRR అఫీషియల్ టీసర్ 2 అయిన కొమరం భీమ్ ఇంట్రో టీసర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా సోషల్ మీడియా లో 24 గంటల్లో ఊహకందని రికార్డులతో ఊచకోత కోశారు ఫ్యాన్స్ అందరూపాత రికార్డుల బెండు తీస్తూ కొత్త రికార్డులను

నమోదు చేస్తూ ఆల్ టైం హిస్టారికల్ బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ టీసర్లకు సెట్ చేసి పెట్టారు. మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే సరికి లైక్స్ పరంగా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న టీసర్ వ్యూస్ పరంగా జస్ట్ లో టాప్ రికార్డ్ ను మిస్ చేసుకుని టాప్ 2 లో నిలిచింది.

ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి వ్యూస్ పరంగా 14.147 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీసర్ లైక్స్ పరంగా 940.3K లక్షల లైక్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో రెస్పాన్స్ మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు.

ఓవరాల్ గా వ్యూస్ పరంగా ఇయర్ మొదట్లో రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా టీసర్ 14.64 మిలియన్ వ్యూస్ తో ఇప్పటికీ టాప్ లో ఉండగా ఇప్పుడు రెండో ప్లేస్ లో రామరాజు ఫర్ భీమ్ టీసర్ నిలిచింది, లైక్స్ పరంగా ఇది వరకు భీమ్ ఫర్ రామరాజు టీసర్ 494K లక్షల లైక్స్ ని అందుకోగా ఇప్పుడు

రామరాజు ఫర్ భీమ్ కొత్త రికార్డ్ ను ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి 940.3K లక్షల లైక్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. అప్ కమింగ్ టీసర్ లకు కొత్త బెంచ్ మార్క్ సాలిడ్ గా సెట్ చేసి పెట్టింది ఈ సినిమా టీసర్. మరి ఈ రికార్డులు ఏ టీసర్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి..

 

'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ రివ్యూ.!RRR రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా.?     

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ లాక్ డౌన్ కారణంగా   ఈ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో నిలిచింది ఈ సినిమా. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ టీజర్ ని విడుదల చేసారు.

ఇప్పటికే ప్రభాస్ 'విక్రమాదిత్య' - హీరోయిన్ పూజా హెగ్డే 'ప్రేరణ' లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. లేటెస్ట్ గా 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ వదిలారు. ఓ అరచేతిలో చూపిస్తూ అందులో నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలుని చూపించారు. ఆ రైలులో సలీం - అనార్కలి.. రోమియో - జూలియట్.. దేవదాస్ - పార్వతి వంటి కొంతమంది ప్రఖ్యాత ప్రేమికులను చూపిస్తూ రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ ని పట్టుకోవడం చూపించారు. అప్పుడే ట్రైన్ డోర్ లో నుంచి వింటేజ్ ప్రేమికులు ప్రభాస్ - పూజాహెగ్డే బయటకు వేలాడుతున్నట్లు చూపించారు. దీనికి చివరలో మ్యూజిక్ బిట్ జత చేశారు. మోషన్ పోస్టర్ అని చెప్పినా టీజర్ అనుకునే విధంగా చూపించారు. ఈ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పటివరుకు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లో RRRMotionPoster – 4.64 మిలియన్ వ్యూస్ అలాగే 359K Likes లతో టాప్ ప్లేస్ లో ఉంది.ఇప్పుడు ఈ 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.