చాలా టైం తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి పండగ రోజు రానే వచ్చింది, ఒక పక్క ఎన్టీఆర్ మరో పక్క బాలయ్య నటించిన సినిమాల అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కి ఈ రోజు పండగే అని చెప్పాలి. ముందు ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రచ్చ చేస్తూ ఉండగా మరో పక్క….
బాలయ్య కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా మొదలు పెట్టిన నర్తనశాల కొన్ని అనుకోని కారణాల వలన ఆగిపోగా… షూటింగ్ చేసిన ఫూటేజ్ ను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే, కాగా ఆ ఫూటేజ్ లో సౌందర్య గారు అలాగే శ్రీహరి గారిని మరొక్క సారి చూసే అవకాశం ఉండటం తో అందరూ ఈ ఫూటేజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
కానీ ఇన్నేళ్ళ తర్వాత ఈ 17 నిమిషాల లెంత్ ఉన్న ఈ ఫూటేజ్ ని ఇప్పుడు 24 న విజయదశమి కానుకగా రిలీజ్ చేయనున్న బాలయ్య శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో రిలీజ్ చేయబోతుండగా సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు.
1 నిమిషం లెంత్ ఉన్న ఈ మినీ ట్రైలర్ ను లాంచ్ చేయగా అప్పటి వుజువల్స్ అయినా కానీ క్వాలిటీ అదిరిపోయే విధంగా ఉందని చెప్పాలి, సౌందర్య గారి స్క్రీన్ ప్రజెన్స్ మెస్మరైజింగ్ అనిపించే విధంగా ఉండగా శ్రీహరి హరి భీముడి లుక్ కూడా అదిరిపోయింది అని చెప్పాలి.
ఈ ఇద్దరి కి చెప్పిన డబ్బింగ్ మాత్రం అంత బాగా సెట్ కాలేదు కానీ ఓవరాల్ గా మినీ ట్రైలర్ మిగిలిన ఫూటేజ్ ఎలా ఉండబోతుందో అన్నది చిన్న హింట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక 17 నిమిషాల ఫూటేజ్ లో బాలయ్య సింగిల్ టేక్ లో చెప్పిన భారీ లెంత్ ఉన్న డైలాగ్ మొత్తం మీద మేజర్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.ఇక నందమూరి అభిమానులకు ఒకే రోజు రెండు సినిమాల టీజర్ లు రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.