కొమరం భీమ్ దడ పుట్టిస్తున్నాడు..24 గంటల రికార్డ్ ని 106 నిమిషాల్లో బ్రేక్.!
s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న సినిమా RRR. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన టీజర్ కి రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రాగా సోషల్ మీడియా లో రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఆల్ మోస్ట్ 6 నెలల కి పైగా టైం తీసుకుని ఇప్పుడు ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయింది.ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా యూట్యూబ్ లో సంచలన రికార్డులను తిరగ రాయాలని ఫ్యాన్స్ స్పీడ్ ని పెంచారు.టాప్ ప్లేస్ లో ఉన్న BheemForRamaraju టీజర్ 24 గంటల్లో 4 లక్షల 94వేల Likes అందుకున్ని టాప్ ప్లేస్ లో నిలిచింది.ఇప్పుడు ఆ రికార్డ్ ని RamarajuForBheem టీజర్ కేవలం ఒక్క గంట 46 నిమిషాల్లో 5లక్షల Likes ని అందుకున్ని అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
3
నిమిషాల్లో ఫాస్టెస్ట్ రికార్డ్ ని బ్రేక్ చేసిన కొమరం భీమ్.!
దర్శకధీరుడు
s.s.రాజమౌళి
దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి RRR
సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ 'మన్నెందొర
అల్లూరి సీతారామరాజు'గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ విప్లవవీరుడు
'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు'
పేరుతో విడుదల అయిన స్పెషల్ టీజర్ కి కేవలం 9 నిమిషాల్లోనే
ఫాస్టెస్ట్ గా 50వేల లైక్ ని అందుకుంది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో విడుదల అయింది.ఈ టీజర్ రాజమౌళి టేకింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపించేలా ఉంది.కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్ ని ఒకొక్క సీన్ లో చుస్తే ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి తెరకెక్కించాడు.ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ ఈ టీజర్ కి మరింతగా ప్లేస్ అయ్యింది. 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ విడుదల అయిన ౩ నిమిషాల్లోనే ఫాస్టెస్ట్ గా 50వేల లైక్ ని అందుకున్ని 'భీమ్ ఫర్ రామరాజు' పేరు తో ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది.