నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి తనే డైరెక్టర్ గా మారి మొదలు పెట్టిన సినిమా నర్తనశాల.టాలీవుడ్ లో అప్పట్లో బిగ్గెస్ట్ సెట్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన విజువల్ వండర్ ఈ సినిమా. అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా ను కొంత భాగం. షూటింగ్ కూడా చేశారు, కానీ సడెన్ గా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. కానీ ఓవరాల్ గా సినిమా ఫూటేజ్ 17 నిమిషాల వరకు ఉండగా ఎప్పటి నుండో ఇండస్ట్రీ వాళ్ళు అభిమానులు ఆ ఫూటేజ్ ని రిలీజ్ చేస్తే… చూడాలని ఉందని.
కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒప్పుకొని బాలయ్య ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఫూటేజ్ ని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు, ఈ నెల 24 న శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతున్న ఈ 17 నిమిషాల ఫూటేజ్ ని చూడాలి అంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఇతర సినిమాల మాదిరిగా ఎక్కువ రేటు పెట్టకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఒక్కో టికెట్ రేటు 50 వరకు పెట్టారు. బుకింగ్స్ ని ఈ రోజు నుండి తీసుకుంటాన్నారు.