యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాదాపుగా రెండేళ్ళ కి పైగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది, ఆల్ మోస్ట్ 2 ఏళ్ల క్రితం అరవింద సమేత సినిమా తో సందడి చేసిన ఎన్టీఆర్ తర్వాత పూర్తీ టైం ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించగా రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న ఈ మల్టీ స్టారర్ కోసం ఆల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది, కాగా సినిమా లో…
రామ్ చరణ్ ఇంట్రో టీసర్ ని మార్చ్ లో రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా ఎన్టీఆర్ బర్త్ డే కి రావాల్సిన ఇంట్రో టీసర్ కరోనా వలన కుదరలేదు అలా 6 నెలలు గడచిన తర్వాత రీసెంట్ గా షూటింగ్ ని మొదలు పెట్టిన టీం ఎన్టీఆర్ టీసర్ ను…
ముందు కంప్లీట్ చేస్తామని, అక్టోబర్ 22 న ఇంట్రో టీసర్ ని రిలీజ్ చేస్తామని అప్ డేట్ చేయగా టైం చెప్పలేదు, దాంతో ఎప్పుడు టైం అప్ డేట్ చేస్తారా అని ఎదురు చూడగా ఈ రోజు 11 గంటలకు మరో 48 గంటల్లో కొమరం భీమ్ ఫస్ట్ లుక్ ఇంట్రో టీసర్ ను సీతారామరాజు
అయిన రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే మరో 48 గంటల్లో యూట్యూబ్ లో దిగబోతున్న ఆర్ ఆర్ ఆర్ కొమరం భీమ్ టీసర్ ఇప్పుడు సునామీ సృష్టించడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి.