Nandamuri Taraka Rama Rao Biography  #NandamuriTarakaRamaRaoBiography 

nandamuri taraka rama rao,nandamuri taraka rama rao biography,nandamuri taraka ramarao,ntr biography,nandamuri family,nandamuri taraka ramarao biography,nandamuri taraka rama rao family tree,nandamuri balakrishna,nandamuri taraka rama rao jr,harikrishna biography,about nandamuri taraka ramarao,legend nandamuri taraka rama rao,nandamuri taraka rama rao movies,nandamuri taraka rama rao marriage,nandamuri taraka rama rao unseen photos,nandamuri taraka rama rao real story

తెలుగు సినిమా అంటే గుర్తొచ్చే మహా నటులలో అగ్రస్థానంలో ఉండే వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమాల మీద ఆసక్తితో ఆయన మద్రాసు వెళ్లారు. మొదటి సినిమా అవకాశం కోసం అందరిలానే ఇబ్బంది పడ్డారు కాని ఎప్పుడైతే మొదటి సినిమా రిలీజైందో అప్పటి నుండి ఎన్.టి.ఆర్ కు తిరుగు లేకుండా పోయింది.

తెలుగు సినీ జగత్తులో ఆబాల గోపాలాన్ని అలరించేలా తన నటనతో ఆకట్టుకున్నారు ఎన్.టి.ఆర్. మాములుగ హీరోలంతా కేవలం ఒక జానర్ కు మాత్రమే ఫిక్స్ అయ్యి సినిమాలు చేస్తారు కాని ఎన్.టి.ఆర్ అన్ని జానర్ లలో సినిమాలు చేశారు. సాంఘికం, జానపదం, చారిత్రాత్మకం, పౌరాణికం ఈ నాలుగు జానర్లలో ఎన్.టి.ఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓ పక్క కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే జానపద సినిమాలను చేస్తూ వచ్చారు. ఇక పౌరాణిక పాత్రల్లో ఆ నందమూరి తారక రామారావు నట విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాముడిగా, కృష్ణుడిగా చిరస్థాయిలో నిలిచిపొయారు ఎన్.టి.ఆర్. రాముడంటే మా ఎన్.టి ఓడే.. కృష్ణుడంటే మా తారక రాముడే అనిపించుకున్నారు.

చేసే పాత్ర ఎలాంటిదైనా సరే దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయడమే ఎన్.టి.ఆర్ కు తెలిసింది. తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టుతో ఐదారు పేజీల డైలాగులైనా సరే అవలీలగా చెప్పే వారు. ఇక ఎన్.టి.ఆర్ తన కెరియర్ మొత్తం మీద 300కు పైగా సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్ సినిమాలే ఎక్కువ.. 1949లో వచ్చిన మన దేశంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 1993లో శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాతో ముగిసింది.

మొదటి సినిమ్నా మనదేశం హిట్ సాధిచగా రెండో సినిమా షావుకారు కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పల్లెటూరి పిల్ల సూపర్ హిట్ గా నిలిచింది. అలా వరుసగా సినిమాలు చేస్తూ ఆరవ సినిమాగా చేసిన సంసారం హిట్ కాగా ఏడవ సినిమాగా వచ్చిన పాతాళభైరవి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటివరకు ఉన్న ఎన్.టి.ఆర్ ఇమేజ్ ను డబుల్ చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చింది పాతాళ భైరవి.  

ఆ తర్వాత వచ్చిన మల్లీశ్వరి కూడా సూపర్ హిట్ అందుకుంది. ఎన్.టి.ఆర్ 10వ సినిమా పెళ్లిచేసి చూడు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో హిట్టైన పాతాళ భైరవిని తమిళ, హిందీ భాషల్లో చేసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నారు ఎన్.టి.ఆర్. ఆ తర్వాత చండీరాణి సినిమాతో కూడా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్ నటించిన 25వ సినిమా తోడు దొంగలు.. ఆ సినిమా భారీ అంచనాలతో రాగా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. రాజు పేద, సంఘం హిట్లు కొట్టగా ఆ తర్వాత వచ్చిన అగ్గి రాముడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

1955లో వచ్చిన మిస్సమ్మ సినిమా కూడా ఎన్.టి.ఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. 35వ సినిమాగా చేసిన కయాశుల్కం హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జయసిం హా, సంతోషం, తెనాలి రామకృష్ణ, జయం మనదే సినిమాలు హిట్లుగా నిలిచాయి. చిరంజీవులు, చరణ దాసి కూడా హిట్ అందుకున్నాయి. ఎన్.టి.ఆర్ కెరియర్ లో 50వ సినిమా భాగ్య రేఖ యావరేజ్ గా నిలిచినా 51వ సినిమాగా తెరకెక్కిన మాయాబజార్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1957లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు.

ఆ తర్వాత వినాయక చవితి, భలే అమ్మాయిలు సినిమాలు కూడా ఎన్.టి.ఆర్ ఖాతాలో హిట్లు గా నిలిచాయి. 1957లోనే వచ్చిన పాండురంగ మహత్యం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తర్వాత వచ్చిన భూకైలాస్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్.టి.ఆర్ 68వ సినిమాగా రిలీజైంది ఇంటి గుట్టు ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచిందిల్. ఆ తర్వాత వచ్చిన అప్పుచేసి పప్పుకూడు సినిమా కూడా హిట్ అందుకుంది. ఇక 74వ సినిమాగా బాల నాగమ్మ హిట్ గా నిలిచింది. 75వ సినిమా వచ్చిన కోడలు నచ్చింది సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత 77వ సినిమాగా వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్.టి.ఆర్ 81వ సినిమా దేవాంతకుడు సినిమా కూడా హిట్ అయ్యింది. 87వ సినిమాగా వచ్చిన సీతారామ కళ్యాణం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 1961లో వచ్చిన 92వ సినిమా జగదేక వీరుని కథ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 99వ సినిమా దక్షయజ్ఞం హిట్ గా నిలిచింది. మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా గుండమ్మ కథ మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత కలిసుంటే కలదు సుఖం సినిమా హిట్ సాధించింది. ఆ తర్వాత టాక్సీ రాముడు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఎన్.టి.ఆర్ కెరియర్ లో 95వ సినిమాగా వచ్చిన సినిమా గులేబకావళి కథ.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఎన్.టి.ఆర్ నటించిన మొదటి 100 సినిమాల్లో 3 ఇండస్ట్రీ హిట్లుగా నిలవగా.. 12 బ్లాక్ బస్టర్ మూవీస్ అయ్యాయి. 14 సూపర్ హిట్ మూవీస్ కాగా.. 14 హిట్ సినిమాలు ఉన్నాయి.. ఇక 35 హిట్ సినిమాలు.. 33 యావరేజ్ సినిమాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్ నటించిన మొదటి 100 సినిమాల్లో కేవలం 3 సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.

ఎన్.టి.ఆర్ 103 వ సినిమాగా చేసిన రక్తసంబంధం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆత్మబంధువు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 1963లో వచ్చిన ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణార్జున యుద్ధం బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఎన్.టి.ఆర్ కెరియర్ లో 110వ సినిమా లవ కుశ. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బందిపోటు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 114వ సినిమాగా వచ్చిన లక్షాధికారి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత నర్తనశాల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాముడు భీముడు, పాండవ వనవాసం, దేవత సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఎన్.టి.ఆర్ కెరియర్ లో 147వ సినిమాగా వచ్చిన శ్రీకృష్ణపాండవీయం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 1966లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఎన్.టి.ఆర్ కైర్యర్ లో 150వ సినిమా శకుంతల యావరేజ్ గా నిలిచింది. పరమానందయ్య శిష్యుల కథ, శ్రీకృష్ణ తులాబారం, పిడుగు రాముడు, గోపాలుడు భూపాలుడు, ఉమ్మడి కుటుంబం, ఆడపడుచు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత కదలడు వదలడు, నిండు హృదయాలు కూడా ఎన్.టి.ఆర్ కెరియర్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత 200వ సినిమాగా వచ్చిన సినిమా కొడలు దిద్దిన కాపురం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.   

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, బడి పంతులు, దేవుడు చేసిన మనుషులు, ఎదురులేని మనిషి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక ఎన్.టి.ఆర్ కెరియర్ లో 246వ సినిమాగా వచ్చిన దాన వీరశూర కర్ణ సినిమా ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 250వ సినిమా మా ఇద్దరి కథ చేసిన ఎన్.టి.ఆర్ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. యమగోల, డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, నా దేశం, శ్రీమద్విరాట్ వీరభ్రహ్మేంద్ర స్వాతి చరిత్ర, మేజర్ చంద్రకాంత్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

300 సినిమాల్లో 7 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఎన్.టి.ఆర్.. 52 బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. 28 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 86 సినిమాలు హిట్ గా నిలిచాయి. కేవలం 15 సినిమాలు మాత్రమే ఫ్లాప్ గా నిలిచాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్.టి.ఆర్ అంటే ఓ చరిత్ర. ఆయన చేసిన సినిమాలు సాధించిన విజయాలు.. అందుకున్న అవార్డులు.. కొట్టిన రికార్డులు ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

1962 సినిమాలో సాంఘిక, పురాణిక, చారిత్రాత్మక, జానపద జానర్ లలో ఆరు సూపర్ హిట్లు అందుకున్నారు ఎన్.టి.ఆర్. ఒకే సంవత్సరంలో ఇన్ని జానర్ లో సూపర్ హిట్ అందుకున్న ఒకే ఒక్క హీరో ఎన్.టి.ఆర్.

మొఖానికి రంగేసుకున్న వాళ్లు రాజకీయానికి పనికిరారని చెప్పిన నోళ్లన్ని మూసుకునేలా పార్టీ పెట్ట్న 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ఎన్.టి.ఆర్. సామాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగు వారి ఆత్మగౌరవంగా తెలుగు దేశం పార్టీ పెట్టి 8 నెలల్లోనే సిఎం అయ్యారు ఎన్.టి.ఆర్.

ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్.టి.ఆర్ అన్న పేరు వినపడగానే ఒళ్లు పులకరించిపోతుంది. తెలుగు భాషకి.. తెలుగు సినిమాకు.. తెలుగు జాతికి ఆయన ఓ చిరునామాగా నిలిచారు. ఎంతమంది హీరోలొచ్చినా.. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినా అప్పటికి ఇప్పటికి తెలుగు సినిమాకు ఒకే ఒక్క హీరో నందమూరి తారక రామారావు.