రామ్
చరణ్ ని CM గా చూపిస్తున్న సౌత్ టాప్ డైరెక్టర్..?
మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ వినయా విదేయా రామ్ సినిమా తరువాత S.S.రాజమౌళి దర్శకత్వంలో యంగ్
టైగర్ ఎన్టీఆర్ తో కలిసి RRR అనే పాన్ ఇండియా సినిమా
చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి కే విడుదల అయిన పోస్టర్స్ కి టీసర్ కి మంచి
రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాని భారీ
అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు
చిత్రయూనిట్.
ఈ
సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్
దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.
రామ్ రామ్ చరణ్ తో చేయబోయే
సినిమా శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఉంటుంది అని టాక్
వినిపిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ముందుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని
ఆ తరువాత అతను cm గా ఏలా మారుతాడు అనే స్టొరీ లైన్ తో దాదాపు
250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని శంకర్ తెరక్కేంచాబోతున్నాడు
అని టాక్.
RRR
కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!అలా చేయడం ఫస్ట్ టైం అంట..!
బాహుబలి
ది బిగినింగ్ మరియు ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా వరల్డ్ వైడ్
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే కలెక్షన్ ని లతో ఇండియాన్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ని
తీసిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RRR అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో
తెరక్కేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇక
రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి,పోస్టర్స్ కి,అలాగే మేకింగ్ వీడియో కి
అందరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా హైప్ క్రియేట్ చేసాడు.ఇప్పుడు
సినిమాకి మారింతగా హైప్ క్రియేట్ చేయడానికి రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేసాడు అని
టాక్ వినిపిస్తుంది.
ఇందులో
భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులపై ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా తీస్తున్నారట. ప్రస్తుతం
రామోజీ ఫిలిం సిటీలో దీని చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ పాట సినిమాలో
ఉండదని.. కేవలం ప్రమోషన్ కోసమే ఉపయోగింస్తారు అని టాక్.రాజమౌళి సినిమాకు ఇలా
ప్రమోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. మరి అదెంత ప్రత్యేకంగా ఉంటుందో అని అందరు
ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్
కోసం కొరటాల శివ..అతని రంగంలోకి దిప్పుతున్నాడుట.!
టాలీవుడ్
ఇండస్ట్రీలో వరుసా విజయాలతో దూసుకుపోతున్న ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే
చెప్పాలి.టెంపర్ సినిమా నుండి అరవింద సమేత వీర రఘువ సినిమా వరుకు వరుసగా 5 బ్లాక్
బస్టర్ హిట్ సినిమాలను అందుకున్ని ఫుల్ జోష్ మీద ఉన్నాడు.ఇప్పుడు s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్
స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే పాన్ ఇండియా సినిమా
చేస్తున్నాడు.
RRR
సినిమా తరువాత ఎన్టీఆర్ తన కెరీర్ లోనే జనతాగ్యారేజ్ లాంటి
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ
దర్శకత్వం లో ఎన్టీఆర్ 30వ సినిమాని తెరక్కేకిస్తున్నాడు.అయితే
ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్
చేస్తుంది.ఈ సినిమాని కొరటాల శివ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నాడు అని
టాక్.
దాదాపు
200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడట. కొరటాల శివ మిత్రుడైన
సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. అతను తొలి
చిత్రాన్ని రాజీ లేకుండా నిర్మించాలనుకుంటున్నాడు.ఇక ఈ సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ లో
స్టార్ట్ చేయాలి అని కొరటాల శివ ప్లాన్ చేస్తునట్లు
ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
KGF చాప్టర్ 2 ట్రైలర్ కి డేట్ ఫిక్స్.! ఫాన్స్ కి పండగే.!
కన్నడ లో తెరకెక్కించిన KGF చాప్టర్ 1
సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల
చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్
హిట్ గా KGF చాప్టర్ 1 సినిమా నిలిచింది.ఈ
సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.
ప్రస్తుతం KGF చాప్టర్ 2 తో ఆడియన్స్ ముందుకి
రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గా యశ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయిన KGF చాప్టర్ 2 మూవీ టీజర్ కి యూట్యూబ్ లో 200 మిలియన్స్ వ్యూస్ లతో
దుమ్ములేపింది.దాతో అందరి దృష్టి KGF చాప్టర్ 2
ట్రైలర్ పై పాడింది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న
సమచారంబట్టి KGF చాప్టర్ 2 ట్రైలర్ ని ఆగష్టు 15న విడుదల
చేసే ఆలోచనలో చిత్రయునిట్ ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇదే నిజం అయితే ఫాన్స్
కి పండగే.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో
చిత్రయునిట్ ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.
గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య.! డైరెక్టర్ అతడేనా.?
నందమూరి బాలకృష్ణ నటించిన మూడు
సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరఅనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా
హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే భారీ యాక్షన్
సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల టీజర్స్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.
ఈ సినిమా తరువాత మరో క్రేజీ
సినిమాని లైన్ లో పెట్టాడు బాలయ్య. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న
సమచారంబట్టి.మరోసారి మరో చారిత్రిక వీరుడి సినిమాకి శ్రీకారం చుట్టే పనిలో
ఉన్నాడు. రుద్రమదేవి పరిపాలన సమయంలో తెలంగాణ బందిపోటుగా అందరికి సుపరిచితుడైన ‘గోనగన్నా రెడ్డి’పై సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్
వినిపిస్తుంది.
బాలకృష్ణ తన టీంతో కలిసి ఈ
సినిమాకి సంబందించిన
పనులను సీక్రెట్ గా ఫినిష్ చేసేస్తున్నారట.ఈ సినిమాకి సీనియర్ డైరెక్టర్
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్
వినిపిస్తుంది.మరి బాలయ్య గోనగన్నా రెడ్డి పాత్ర
కోసం ఎలాంటి కసరత్తులు చస్తారో ఆనంది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.