Trending war భీమ్లా నాయక్ vs పుష్ప రాజ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,ఈ ఇద్దరుకి యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అజ్ఞాతవాసి సినిమా తరువాత దాదాపు మూడు సంవత్సరల గ్యాప్ తరువాత పవర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.మారోపక్క అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత కొత్త గ్యాప్ తీసుకున్ని నటించిన సినిమా అలా వైకుంటపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు.అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫుల్ బీజి గా ఉన్నారు. భీమ్లా నాయ సినిమా టీజర్ మరియు పుష్ప ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.
ఈ రెండు సినిమాలు యూట్యూబ్ లో అల్ టైం రికార్డ్ లతో హిస్టరీ క్రియేట్ చేసాయి.పుష్ప ఫస్ట్ సాంగ్ 24 గంటల్లో 8.2 మిలయన్స్ వ్యూస్ లతో అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది.మరోపక్క భీమ్లా నాయక్ టీజర్ 24 గంటల్లో 8.49 మిలియన్ వ్యూస్ లతో ఫాస్టెస్ట్ అల్ టైం రికార్డ్ లతో ట్రేండింగ్ లో ఫస్ట్,సెకెండ్ ప్లేస్ లో పోటి పడుతూ దూసుకుపోతున్నారు.
అన్న అల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసిన తమ్ముడు.!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ
భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి
అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది….. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్
లో కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపిన ఈ గ్లిమ్స్ మొదటి కొన్ని గంటల లోనే పాత
రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపింది.
పవర్ స్టార్ మాస్ యాటిట్యూడ్, తమన్ మెస్మరైజింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ గ్లిమ్స్ కి మెయిన్ హైలెట్ గా
నిలిచింది. దాంతో అందరూ రిపీట్ మోడ్ లో ఈ గ్లిమ్స్ ను చూస్తూ ఉండటం విశేషం. ఇక ఈ
గ్లిమ్స్ ఇప్పుడు మొత్తం మీద 24 గంటలను పూర్తీ చేసుకుని…
టాలీవుడ్ తరుపున గ్లిమ్స్ లో కొత్త రికార్డులను నమోదు
చేసింది. 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో 8.49 మిలియన్స్ అప్ డేట్ వ్యూస్ ను అలాగే 728.6K లైక్స్
ని సాధించి పాత రికార్డులను తుడిచి పెట్టింది. ఇది వరకు హైయెస్ట్ వ్యూస్ రికార్డ్
సైరా గ్లిమ్స్ పేరిట 7.2M గా ఉండేది.
ఆ రికార్డ్ ను బ్రేక్ 1 మిలియన్ కి పైగా
లీడ్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా లైక్స్ రికార్డ్ రాధేశ్యామ్ గ్లిమ్స్ పేరిట
394.4K గా ఉండేది, ఆ రికార్డ్ ను కూడా
ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ అనిపించే రేంజ్ లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన
భీమ్లా నాయక్ ఏకంగా టాలీవుడ్ టీసర్ల జాబితాలో కూడా టాప్ 5 లో
ఒకటిగా….
నిలిచే విధంగా లైక్స్ తో దుమ్ము లేపింది…ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 940.3K, పుష్ప ఇంట్రో టీసర్ 793K,
వకీల్ సాబ్ టీసర్ 776.9K, సర్కారు వారి పాట
బ్లాస్టర్ 754.9K తర్వాత ఇప్పుడు 728.6K మార్క్ ని అందుకుని టాప్ 5 లో కూడా చోటు సొంతం
చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే మామూలు ఊచకోత కాదనే
చెప్పాలి.
అదృష్టం అంటే శ్రీకాంత్ అడ్డాల దే.! నారప్ప తో జాక్ పాట్
కొత్త బంగారు లోకం సినిమా తో టాలీవుడ్
లో డైరెక్టర్ గా అడుగు పెట్టిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమా తో తన మార్క్ ని
చూపెట్టగా రెండో సినిమా నే ఏకంగా టాలీవుడ్ లో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని
తిరిగి మొదలు పెడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు…
తర్వాత ముకుంద సినిమా తో నిరాశ పరచగా మహేష్ బాబు
బ్రహ్మోత్సవం సినిమాతో ఛాన్స్ కొట్టి ఆ సినిమా కి ఏకంగా 9 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని కూడా అందుకోగా ఆ సినిమా డిసాస్టర్ తర్వాత
అడ్డాల కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఆల్ మోస్ట్ 4 ఏళ్ల
టైం పట్టగా…
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమా తెలుగు
రీమేక్ ని విక్టరీ వెంకటేష్ తో నారప్ప పేరు తో రీమేక్ చేయగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు
థియేటర్స్ లో రావాల్సింది కానీ పరిస్థితుల వలన డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్
అవ్వాల్సి వచ్చింది.
అయినా కానీ అక్కడ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా
ఓవరాల్ గా అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ టైం లో రోజుకి
2
లక్షల రెమ్యునరేషన్ చొప్పున పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల సినిమా షూటింగ్
పూర్తీ అయ్యే టైం కి 90 లక్షల దాకా రెమ్యునరేషన్ ని అందుకోగా
ఇప్పుడు సినిమా డిజిటల్ లో…
సూపర్ హిట్ అవ్వడం ఓవరాల్ గా అల్టిమేట్ బిజినెస్ ను
సాధించి నిర్మాతలకు సూపర్ ప్రాఫిట్స్ ను తెప్పించడంతో అడ్డాలకి రెమ్యునరేషన్ బోనస్
కింద మరో 1.1 కోట్ల రెమ్యునరేషన్ ని ఇచ్చారట. దాంతో ఇప్పుడు
నారప్ప సినిమా కి ఓవరాల్ రెమ్యునరేషన్ కింద 2 కోట్ల
రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. ఊహకందని డిసాస్టర్ అయిన బ్రహ్మోత్సవం తర్వాత
శ్రీకాంత్ అడ్డాలకి మంచి కంబ్యాక్ గా నిలిచింది నారప్ప…
EMK షోతో ఆ TRP రేటింగ్ ని టర్గెట్ చేసిన ఎన్టీఆర్.!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఇసారి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ని దక్కించుకొనడానికి ఆర్,ఆర్,ఆర్ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు.s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న తోలి పాన్ ఇండియా మూవీని D.V.V.దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ క్రేజ్ మూవీ 5 భాషలో విడుదలకు సిద్ధం అవుతుంది.
ఎన్టీఆర్ వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ మరోపక్క బుల్లితెర పై హోస్ట్ గా దుమ్ములేపోతున్నాడు.Bigg Boss తెలుగు సీజన్ 1 తో హోస్ట్ గా మారి ఆ షో ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ భారీ TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉచ్చాడు.కొత్త గ్యాప్ తీసుకున్ని ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
టెలివిజన్ హిస్టరీలో హైయెస్ట్ TRP రేటింగ్ ని సోతం చేసుకున్నBigg Boss 4 కి 21.7 TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది.ఆ రికార్డ్ ని ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో బ్రేక్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆగష్టు 22న ఆడియన్స్ ముందుకి రాబొతున్నాడు ఎన్టీఆర్.
RRR వాయిదా..? వెనుక ఏం జరిగింది.!!
ఇప్పుడు ఇండియా
అంత ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మూవీ అంటే.. ఆర్ఆర్ఆర్‌యే. బాహుబలి తర్వాత రాజమౌళి
రూపొందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకి ఇప్పటికే
రెండుసార్లు విడుదల తేది ఇచ్చి వాయిదా వేయడం తెలిసిందే. చివరగా ఖరారైన రిలీజ్
డేట్ అక్టోబరు 13.
కానీ ఆ డేట్ ఇచ్చాక కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. షూటింగ్ ఆలస్యమైంది.
దీంతో మరోసారి వాయిదా అనివార్యం అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ టీం మాత్రం అదే డేట్‌కు
కట్టుబడి ఉన్నట్లుగా కనిపించింది.
ఈ మధ్య విడుదల
చేసిన మేకింగ్ వీడియోలోనూ అక్టోబరు 13నే ఈ సినిమా విడుదల కానున్నట్లు స్పష్టం
చేశారు.లేటెస్ట్ గా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబరులోనే కాదు.. ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశమే లేదట. ముందు దసరాకు
అయితే మూవీ రాదన్నది స్పష్టం.
ఆర్ఆర్ఆర్ విడుదల
కావాల్సిన తేదీకి ఇప్పట్నుంచి ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఇంకా
ఇండియాలో చాలా చోట్ల థియేటర్లు మూతపడి ఉన్నాయి.బాలీవుడ్ థియేటర్ల పరిస్థితి
ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వచ్చే రెండు నెలల్లో అంత వేగంగా పరిస్థితులు మారిపోతాయన్న
ఆశ లేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీం ఇంకా చివరి పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. తర్వాత
పోస్ట్ ప్రొడక్షన్ పని మిగిలుంది. అక్టోబరు 13కు విడుదల అంటే హడావుడి తప్పదు.
థియేటర్ల పరిస్థితి
ఆశాజనకంగా ఉంటే రేయింబవళ్లు కష్ట పడి అయినా మూవీ ను సిద్ధం చేయొచ్చు. కానీ
అక్కడ పరిస్థితులు బాగా లేవు. అందుకే మూవీ ను వాయిదా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం
కనిపించడం లేదు. సంక్రాంతికి ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమాలు ఉండడంతో ఈ సినిమాని
సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో చిత్రయునిట్ ఉన్నారు.