భీమ్లా నాయక్ దెబ్బకు అల్ ఇండియా షేక్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో
తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం
కోశియుం సినిమా తెలుగు రీమేక్ గా తెరకేక్కుతూ ఉండగా సినిమా మేకింగ్ వీడియోలతో మంచి
హైప్ ను ఆల్ రెడీ సొంతం చేసుకోగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్
చేశారు మేకర్స్…. ఫ్యాన్స్ అంచనాలను కూడా మించి పోయే విధంగా…
కట్ చేసిన ఈ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి మామూలు కిక్ ఇవ్వలేదు, రీసెంట్ టైం లో టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లోకి వన్ ఆఫ్ ది బెస్ట్
బ్యాగ్రౌండ్ స్కోర్ అనిపించుకునే రేంజ్ లో అల్టిమేట్ BGM తో
తమన్ ఊరమాస్ కొట్టుడు కొట్టగా పవర్ స్టార్ యాటిట్యూడ్…
అండ్ మాస్ డైలాగ్ విత్ గూస్ బంప్స్ ఎలివేషన్స్ తో
గ్లిమ్స్ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. దాంతో టాలీవుడ్ గ్లిమ్స్ రికార్డులు కాదు ఇండియన్
గ్లిమ్స్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తున్న ఈ గ్లిమ్స్ ఇప్పుడు
ఇండియా వైడ్ గా ఓ క్రేజీ టాపిక్ గా మారింది.
బ్యాగ్రౌండ్
స్కోర్ ఓ రేంజ్ లో అదరగొట్టడంతో సోషల్ మీడియా లో అన్ని చోట్లా భీమ్లా నాయక్ మీమ్స్, వీడియోల హవా
నడుస్తుంది. ట్విట్టర్ లో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలివేషన్స్ నుండి మొదలు కొని ఇతర
విషయాల్లో కూడా భీమ్లా నాయక్ గ్లిమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని, పవన్ కళ్యాణ్ డైలాగ్ కట్ ను కూడా ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు.
మేకర్స్ సాలిడ్
రెస్పాన్స్ ని అయితే గ్లిమ్స్ తో ఎక్స్ పెర్ట్ చేశారు, ఈ రేంజ్
యుఫోరియా ని మాత్రం అంచనా వేయలేదు, ఆ రేంజ్ లో కిక్ ఇచ్చిన భీమ్లా
నాయక్ ఇప్పుడు ప్రస్తుతం వైడేస్ట్ రీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా
నిలిచింది, సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి
ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానుంది ఇప్పుడు.
ఢీ అంటే ఢీ అంటున్న నాని vs నాగ చైతన్య
టక్ జగదీష్
మరియు లవ్ స్టొరీ ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ మొదట్లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్
నుండి కూడా పోటి పడుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ లో ఒక వారం
గ్యాప్ తో ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ సెకెండ్ వేవ్
ఎఫెక్ట్ వలన రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన
పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి.
ఇక డిజిటల్ లో
రిలీజ్ చేయించడానికి ఈ రెండు సినిమాలకు కూడా అల్టిమేట్ OTT డీల్స్
వచ్చాయి కానీ లవ్ స్టొరీ ససేమీరా నో చెప్పి ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే
రావాలని ఫిక్స్ అవ్వగా టక్ జగదీష్ కూడా థియేటర్స్ లోకి రావాలని ఎంత ట్రై
చేస్తున్నా కానీ…
చాలా టైం నుండి
సినిమా పెండింగ్ లో ఉండటం తో ఫైనాన్స్ ఇబ్బందుల వలన సినిమా డిజిటల్ లోనే రిలీజ్
అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు పోటి పడబోతున్నాయి అన్నది
లేటెస్ట్ టాలీవుడ్ టాక్. లవ్ స్టొరీ సినిమా ఆడియన్స్ ముందుకు…
సెప్టెంబర్ 10 న రిలీజ్
అవ్వబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో సినిమా థియేటర్స్ లో వినాయక చవితి
కానుకగా రిలీజ్ అవ్వడం కన్ఫాం అవ్వగా మరో పక్క నాని టక్ జగదీష్ సినిమా వినాయక
చవితి కి డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, త్వరలోనే
అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది ఈ సినిమా పై… దాంతో రెండు
సినిమాలు కూడా పోటి పడబోతున్నాయి కానీ…
అందులో ఒకటి థియేటర్స్
లో రిలీజ్ కాబోతుండగా మరో సినిమా డిజిటల్ లో రిలీజ్ కానుంది. టక్ జగదీష్ సినిమా
మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి కానీ మేకర్స్ తప్పక డిజిటల్ వైపు అడుగు వేశారని
సమాచారం. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ సినిమా వినాయక చవితికి డిజిటల్ లో రిలీజ్
అవ్వడం ఖాయమంటూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు.