పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీ “ఆదిపురుష్” కూడా ఒకటి. దీనిని
బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రామాయణ
ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో ప్రభాస్ ప్రస్తుతం
చురుకుగా పాల్గొంటున్నాడు. మరి ఈ సినిమా పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్
ఒకటి బయటకి వచ్చింది.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వరకు 65 రోజుల మేర టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. అలాగే ఈ సినిమా తాలూకా మొత్తం షూట్ ని ఓంరౌత్ ఈ ఏడాది చివరి నాటికి కంప్లీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి ఎలాగో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నెమ్మదిగా చేసినా ఆగష్టు నాటికి సినిమా రెడీ అయ్యిపోవచ్చు. మరి ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో అనేది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.