ఆనంద్,గోదావరి,ఫిదా సినిమాలతో మనసుకు హత్తుకునే ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.లేటెస్ట్ గా ఆయన దర్శకత్వం వహించిన మరో అందమైన చిత్రం ‘లవ్ స్టొరీ’.అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరొయిన్ గా నటించిన సినిమా లవ్ స్టొరీ.ఇక ఈ సినిమాకి సంభదించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఆ భారీ హైప్ తో ఈ సినిమా నేడు విడుదల అయింది.మారి సినిమా ఆడియన్స్ కు ఏ రేంజ్ లో మెప్పించిందో తెలుసుకుందాం.!
స్టొరీ : నాగ చైతన్య,సాయి పల్లవి తమతమ జీవితంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో నాగ చైతన్య కి సాయి పల్లవి కనిపిస్తుంది.ఆ తరువాత ఆమె డాన్సర్ అన్ని తెలుస్తుంది.ఆ తరువాత సాయి పల్లవి తన గ్రూప్ లో చేరమని నాగ చైతన్య అడగం.ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరు ప్రేమించుకుంటారు .ఈ ప్రేమ విషయం సాయి పల్లవి ఇంట్లో తెలిసిన తరువాత నాగ చైతన్య,సాయి పల్లవి జీవితం ఏలా మారింది అని తెలుసుకోవాలి అంటే మీరు ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : నాగ చైతన్య,సాయి పల్లవి ఈ ఇద్దరు తమతమ పాత్రలో జీవించారు.ఒకరితో ఒక్కరు పొట్టి బడి మారి నటించారు.ఇక ఈ సినిమా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించారు.మిగిలిన నటీనటులు తమతమ పాత్రలో మేపించారు.ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ శేఖర్ కమ్ముల.తను అనుకున్న స్టొరీ ని అలాగే వెడితెర పై అద్బుతంగా తెరకెక్కించాడు.మనసుకు హత్తుకునే సీన్లు తీయడంలో తన హ్యాండ్ ను మరోసారి గట్టిగానే చూపించాడు శేఖర్ కమ్ముల.ఇక సినిమాకి మరో ప్లేస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి.చాలా రోజుల తరువాత ఒక్క మంచి లవ్ స్టొరీ మూవీని చూస్తున్నామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.
మైనస్ పాయింట్లు : సినిమా లెంత్ 2 గంటల 38 నిముషాలు ఉండడం. ఈ సినిమాకి మీము ఇచ్చే రేటింగ్ :4/5