శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయా విధేయ రామా సినిమా తరువాత చేస్తున్న
లేటెస్ట్ మూవీ ఆర్,ఆర్,ఆర్ అనే ఈ సినిమాని
చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి s.s.రాజమౌళి
దర్శకత్వంలో నటిస్తున్నారు.ఇక ఏ సినిమా
D.v.v.దానయ్య దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,తమిళ్,హిందీ.మలయాళం భాషలో
నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాని భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా జనవరి 7న విడుదల
కానుంది.
ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని N.శంకర్ దర్శకత్వంలో
సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక రీసెంట్ గా పూజ కార్యక్రమాలు కూడా కంప్లేట్
చేసుకున్న ఈ సినిమా తవరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమా కోసం
రామ్ చరణ్ రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట.ఈ సినిమా బడ్జెట్ 250
కోట్లు అయితే అందులో 80 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అని సమచారం
వస్తుంది.
‘అఖండ’ నుంచి యాక్షన్ టీజర్ !
నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘అఖండ’. కాగా అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా నుంచి కొత్త టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ దసరాకి టైటిల్ సాంగ్ విడుదల చేయనున్నారు. అలాగే నెలాఖరులో టీజర్ ను రిలీజ్ చేస్తారు. అఖండ రెండో టీజర్ ఇది. మొదటి టీజర్ లాగానే, రెండవది కూడా భారీ యాక్షన్ బ్లాక్ లతో రాబోతుంది. ఈ టీజర్ లో కూడా కొన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ ఉండబోతున్నాయి.
ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉంటాయట. పైగా బోయపాటి అంటేనే యాక్షన్. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు బారీ విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు చేస్తోన్న సినిమా కూడా హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.