అఖండమాస్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.?

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన లేటెస్ట్ సినిమా అఖండ”. వీరిద్దరి నుంచి ఆల్రెడీ రెండు భారీ హిట్స్ ఉండడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా విడుదల  పై గత కొంత కాలం నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది..

అలా ఈ సినిమా డిసెంబర్ కి ఫిక్స్ అయ్యింది అని బజ్ వినిపిస్తుండగా ఈ సినిమా మాస్ ట్రైలర్ కట్ పై లేటెస్ట్ ఇన్ఫో వినిపిస్తుంది. చిత్ర యూనిట్ ఆల్రెడీ ఈ సినిమా మాస్ ట్రైలర్ కట్ పై వర్క్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ నవంబర్ 15న విడుదల చేస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయడానికి చిత్రయునిట్ ప్లన్ చేస్తున్నారు.    

 

మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ బజ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో తీస్తున్న భారీ సినిమా సర్కారు వారి పాటకోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ చేయనున్నారు. మరి దీనిపై కూడా ఆల్రెడీ సాలీడ్ అంచనాలు ఉన్నాయి.

మాంచి యాక్షన్ డ్రామాగా దాదాపు పాన్ ఇండియన్ ఫ్లిక్ గా ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు దీనిపైనే లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా తాలూకా ప్రీ ప్రొడక్షన్ పనులు డిసెంబర్ నాటికి కంప్లీట్ కానున్నాయట. మరి అక్కడ నుంచి సర్కారు వారి పాట కంప్లీట్ అవ్వగానే కొత్త లుక్ సిద్ధం చేసి త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు  జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాలో మరోసారి పుజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా థమన్ సంగీతం అందివ్వనున్నాడు.



వీర నాటుకి యూట్యూబ్ దద్దరిల్లుతుంది.!!  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇప్పటి వరకు ఆడియన్స్ ముందుకు వచ్చిన స్టిల్స్ కానీ ఇంట్రో టీసర్ లు కానీ సినిమా ఓ సీరియస్ యాక్షన్ మూవీ అన్న ఫీలింగ్ నే క్రియేట్ చేసింది కానీ అసలు సినిమాలో ఇలాంటి కంటెంట్

ఉంటుందా అన్నట్లు ఆశ్యర్య పరిచేలా రీసెంట్ గా సినిమాలోని రెండో సాంగ్ అయిన నాటు నాటు లిరిక్ తో వస్తున్న మాస్ భీట్ సాంగ్ ని విడుదల చేసారు. ఇద్దరు స్టార్ హీరోలో ఒక్క మాస్ సాంగ్ కి డాన్స్ చేస్తే ఆ కిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.మాస్ స్టెప్స్ లతో ఎన్టీఆర్,రామ్ చరణ్ దుమ్ములేపారు అన్ని చెప్పాలి.

ఈ సాంగ్ మూడు నిముషాల 29 సెకన్ లు ఉన్న ఈ సాంగ్ కి కీరవాణి ఇచ్చిన టోన్ అందరిపోయింది అని చెప్పాలి. ఎన్టీఆర్,రామ్ చరణ్  ఇద్దరి కాంబోలో ఓ మాస్ సాంగ్ కూడా ఉందని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు, అది కూడా ఈ రేంజ్ మాస్ భీట్ తో ఇద్దరు హీరోల డాన్స్ మూమెంట్స్ రచ్చ రచ్చ చేసేలా ఉండడంతో యూట్యూబ్ లో 24 గంటల్లో కంప్లేట్ అయ్యేసరికి ఇంటువంటి రరికార్డ్ లను బ్రేక్ చేస్తుందో చూడాలి.ఈ సాంగ్ కి మీ 4/5 స్టార్స్ ఇస్తున్మం మీరు సాంగ్ వీటి ఎంత రేటింగ్ ఇస్తున్నారు కంమేట్స్ లో టిప్ చేయండి.