100M

అయ్యగారి దెబ్బకు OTT  దద్దరిలింది.!!



అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతోనే హిట్ ని అందుకుంటాడు అని అందరూ అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన హలో,mr.మజన్ను రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని పూజ హేడిగి కలిసి చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే 5.14cr ప్రోఫీర్ ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ott లో ఈ నెల 19న విడుదల చేస్తే అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో కేవలం 2 రోజుల్లోనే ఈ 100 మిలియన్ల నిమిషాల రన్ టైం ను దక్కించుకుంది అంటూ ఆహా టీం అఫీషియల్ గా అనౌస్ చేసారు. అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపిన ఈ సినిమా ఇపుడు ఓట్ లో కూడా దుమ్ములేపోతు దూసుకుపోతుంది.

 

 

 

అక్కడ 1.8 కోట్లు….టాలీవుడ్ లో రికార్డ్ ఇది!

 

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన లేటెస్ట్ సినిమా అఖండ”. వీరిద్దరి నుంచి ఆల్రెడీ రెండు భారీ హిట్స్ ఉండడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసుకుంది.ఇప్పటికే విడుదల అయ్యిన ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా  గ్రాండ్ రిలీజ్ కి టైం దగ్గర పడింది, ఈ సినిమా కి అన్ని సెంటర్స్ ల యమ జోరుగా రిలీజ్ ప్లానింగ్స్ జరుగుతూ ఉండగా థియేటర్స్ కూడా భారీగా అరేంజ్ చేస్తున్నారు. ఇక బిజినెస్ కూడా అల్టిమేట్ అనిపించే విధంగా సాగుతూ ఉండగా సినిమా కి హైర్స్ కూడా ఇప్పుడు యాడ్ అవ్వబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా సెంటర్స్ లో…..పెద్దగా ట్రాకింగ్ ఉందని సి డి సెంటర్స్, చిన్న చిన్న స్టేషన్స్ ని గంపగుత్తుగా ఒక రేటుకి అనుకుని రేటు చెల్లిస్తారు బయర్స్ఇక అక్కడ టికెట్ రేట్లు వాళ్ళ ఇష్టం, నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకేఆ రేటుని సినిమాల కలెక్షన్స్ విషయంలో ఫస్ట్ డే కి, వీకెండ్ కి లేదా వీక్ ఎండ్ అయ్యే టైం కి కలుపుతారు. వీటినే హైర్స్ అంటారు, ఇప్పుడు అఖండ సినిమాకి కూడా పలు చోట్ల హైర్స్ కన్ఫాం అవ్వగా గుంటూరు సి డి సెంటర్స్ లో 1.8 కోట్ల హైర్స్ ని బయ్యర్లు కోట్ చేశారట మేకర్స్ కి…. సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో ఇది హైయెస్ట్ రేటుగా చెప్పాలి. కానీ మేకర్స్ ఇంకా బెటర్ ఆఫర్ వస్తుందా అని ఎదురు చూస్తారట, రిలీజ్ టైం కి ఇంతకుమించి ఆఫర్ రాకుంటే ఈ రేటు ఫైనల్ అవ్వడం ఖాయం అని చెప్పాలి.  

 

 

     

 




అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. అఖిల్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ గా ఈ సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. మంచి వసూళ్లను దక్కించుకున్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను తాజాగా ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ కు ముందు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఆహాలో ఈ సినిమా ను ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

బ్యాచిలర్ ఆహా లో స్ట్రీమింగ్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ ల నిమిషాల రన్ టైమ్ ను దక్కించుకుంది అంటూ ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించారు. తక్కువ సమయంలో ఇంత భారీ రన్ టైమ్ దక్కడం చూస్తుంటే బ్యాచిలర్ సినిమా మరోసారి విజయం సాధించినట్లుగా అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేక పోవడంతో ఇలా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేశారు. ఆహా లో స్ట్రీమింగ్ మొదలు అయిన వెంటనే భారీగా జనాలు ఓటీటీ స్టీమింగ్ కు సిద్దం అయ్యారని తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

 

 

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ పాట.. నిజమేనా ?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్స్ లో, పలు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడారని ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. కానీ, ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ పై వచ్చే ప్రతి అప్ డేట్ దేశవ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగాబాహుబలితర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ఫిక్స్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పై ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ వార్త వినడానికి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

ఐతే, తాజా వార్త ప్రకారం కియారా అద్వానీ ప్లేస్ లో జాన్వీ కపూర్ వచ్చింది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. తాజాగా ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.