అఖండ  USA గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం.!

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ సినిమా అఖండ”. ఇక రీసెంట్ గా భారీ అంచనాలతో విడుదల అయిన ట్రైలర్ కి అభిమానులు నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మరియు భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. పైగా సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో బోయపాటి ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తుండడంతో బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఇక డిసెంబర్ 2న భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా usa లో గ్రాండ్ ప్రీమియర్స్ కి కూడా సిద్ధం అవుతుంది. రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారి డిస్ట్రిబ్యూషన్ లో ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా టోటల్ థియేటర్ లిస్ట్ కూడా వచ్చి వైరల్ అవుతుంది. దీనిని బట్టి అఖండ విడుదల గ్రాండ్ గా ఉండబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

 

మహేష్ బాబు, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో ఈ హీరోయిన్ పేరు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు  హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటకోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్  బాబు నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పై ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి పేరు రేస్ లోకి వచ్చిందట. ఆల్రెడీ పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా మరో హీరోయిన్ పేరు పట్ల కొంత కాలంగా సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.  

 

 

 

 

 

 

RRR మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.??

 

s.s.రాజమౌళి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత  తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఎప్పటి నుండే ఈ సినిమా నుండి అఫీషియల్ టీజర్ విడుదల అవుతుంది అని వెయిట్ చేసి అభిమానులకు రాజమౌళి గ్లిమ్స్ పేరు తో విజవాల్ వండర్ గ్లిమ్స్ ని అందిచాడు.ఆ తరువాత ఈ సినిమా నుండి రెండువ సాంగ్ నాటు సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ ని మేకర్స్ వచ్చే నవంబర్ 24 న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాని భారీ అంచనాలతో నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది.