నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అయినా అఖండ ట్రైలర్ కి అందరిపోరే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా రీసెంట్ గా అభిమానుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ లతో దూములేపింది.అఖండ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 74 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే 29 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక ఈ సినిమా ఇప్పటివరుకు టోటల్ గా 61.97 కోట్ల షేర్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది.ఇక 12వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ దగ్గర 70% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 1.5 నుండి 2 కోట్ల వరుకు కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
ఒక్క అడుగు దూరంలో రికార్డ్…అఖండ మాస్ రాంపేజ్!
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. సినిమా తెలుగు రాష్ట్రాలలో అంటే మాస్ ని ఓ రేంజ్ లో మెప్పించింది కానీ అమెరికాలో మాస్ మూవీస్ ని పెద్దగా చూడరు కానీ అఖండ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ వస్తున్నాయి.
సినిమా అక్కడ ఆల్ రెడీ బోయపాటి కెరీర్ లో నంబర్ 1 మూవీగా మారగా ఇప్పుడు మ్యాజికల్ 1 మిలియన్ మార్క్ ని అందుకోవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తుంది. సినిమా అక్కడ 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ డాలర్స్ లెక్క ని ఒకసారి గమనిస్తే…
Total Gross: $983,683[7.44Cr] ఇదీ అక్కడ సినిమా కలెక్షన్స్ జాతర… ఇంకో 17 వేల డాలర్స్ వచ్చేస్తే సినిమా అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకుంటుంది… ఇది ఎన్ని రోజుల్లో అవుతుందో చూడాలి ఇక.
పుష్ప ఉరమాస్..500 నుండి 700 ..తగ్గేదే లే.!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేటర్స్ కౌంట్ ఒక్కో ఏరియాలో కన్ఫాం అవుతూ ఉండగా నైజాం లో ఆల్ మోస్ట్ 300 వరకు థియేటర్స్ కన్ఫాం అవ్వగా ఫైనల్ కౌంట్ ఇంకా పెరగడం ఖాయం. ఇక సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ కానుంది.
అమెరికాలో సినిమా ఆల్ మోస్ట్ 420 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను ఇప్పటి వరకు కన్ఫాం చేసుకోగా ఫైనల్ లెక్క 500 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక టోటల్ ఓవర్సీస్ లో మినిమమ్ 600 నుండి 700 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుందట.
సుకుమార్ కి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్నా అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో ఇండస్ట్రీ రికార్డులు ఓవర్సీస్ లో సొంతం చేసుకున్నా వీళ్ళ కాంబోలో వస్తున్న ఊరమాస్ కంటెంట్ తో వస్తున్న పుష్ప మాత్రం ఈ రేంజ్ లో రిలీజ్ కాబోతుండటం విశేషం అని చెప్పాలి. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.