ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ ల కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్  డ్రామా పుష్ప. అల్లు అర్జున్ తో పాటు సుకుమార్‌ కూడా తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి ఈ సినిమా చేశాడు. ఇన్నాళ్లు కమర్షియల్‌ స్టార్‌గా మాత్రమే ప్రూవ్‌ చేసుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో నటుడిగానూ మరో మెట్టు ఎక్కాలని భావిస్తున్నాడు. మరి ఈ ప‍్రయత్నంలో సుకుమార్ విజయం సాధించాడా..? కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన పుష్ప ప్రేక్షకులను ఆకట్టుకుందా..?మరి టాక్ ఎలా ఉందంటే....?

స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కింగ్ అయిన విలన్ సునీల్ దగ్గర ఎర్రచందనమును అడవి లో నుండి సునీల్ దగ్గరకు తీసుకు వచ్చే లారీ డ్రైవర్ గా పని చేసే అల్లు అర్జున్ ఎలా అంచలంచలుగా ఎదిగి డాన్ గా మారాడు అన్నది.. 

ఓవరాల్ గా స్టొరీ పాయింట్ అయినా కానీ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయని, ఫస్టాఫ్ కథ సెట్ అవ్వడానికి టైం పట్టడంతో కొంచం బోర్ అనిపించినా కథ లో కి ఎంటర్ అయిన తర్వాత... 

ఇంటర్వెల్ వరకు కథ అద్బుతంగా ఉంటుందని, సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా సెకెండ్ ఆ అంచనాలను అందుకునేలా ఉన్నప్పటికీ కథ నెమ్మదిగా సాగుతుందని, లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్, మెయిన్ కథ ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి అలాగే కథ మరీ మాస్ గా ఉండటం డ్రా బ్యాక్ అంటూ......

ప్రీమియర్ షో చూసిన వాళ్ళు చెబుతున్నా... ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఉందని చెబుతున్నారు. మాస్ కి సినిమా నచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, క్లాస్ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అన్నది చెప్పగలం అంటున్నారు. ఓవరాల్ గా అల్లు అర్జున్ వన్ మాన్ షో అయినా...

దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడని... హీరోయిన్ రష్మిక పర్వాలేదు అనిపించగా సమంత ఐటెం సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇతర స్టార్ కాస్ట్ కూడా మెప్పించగా ఫైనల్ గా సినిమా మరీ మాస్ కంటెంట్ తో ఉండటంతో ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించిందని చెబుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో రెగ్యులర్ ఆడియన్స్ నుండి కుండ ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తే పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్ లను క్రియేట్ చేయడం పక్క అని చెప్పాలి.

 

 

 

 

 

  

 

 

ఇంటర్వెల్వ్ ట్విస్ట్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని.. సమంత ఐటమ్ సాంగ్ వెరీ హాట్ అని వింటర్ బ్లాక్ బస్టర్‌ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ ఏకంగా నాలుగు స్టార్లు వేసేశాడు ఉమర్ సంధు.

2021లో ది బెస్ట్ ఫిల్మ్ పుష్ఫ అని చెప్తూ.. అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయిందన్నారు. దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే జింగ్ జింగ్ అమైజింగ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక రష్మిక పెర్ఫామెన్స్‌ని కూడా ఆకాశానికి ఎత్తేశారు. గ్లామర్‌ అదిరిపోయిందని.. పుష్పతో మరో హిట్ కొట్టేసిందంటున్నారాయన.

 

పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేం. అంతగా ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ప్రతి ఎక్స్‌ప్రెషన్‌నూ రాజీ పడకుండా లోపం ఉందని ఎత్తిచూపలేని విధంగా నటించాడు. అంతగా తన పాత్రతో ప్రేక్షకులను ప్రభావితం చేశాడు. ఇక శ్రీవల్లీ గా రష్మిక నటన అద్భుతమనే చెప్పాలి.  


పుష్ప  ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ప్రతి సన్నివేశం సినిమా స్థాయిని పెంచింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. ప్రతి పాట సందర్భానుసారంగా వచ్చినవే. దేన్ని కావాలని చొప్పించిన భావన ప్రేక్షకుడికి కలగదు. సన్నివేశాలను పాటలతో లింక్ చేస్తూ చూపించడం బాగుంది. పాటల చిత్రీకరణ మనసును తాకుతుంది. ఇక దేవి నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. 

సినిమా నిడివి ఎక్కువ ఉన్నా ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ ఎంతమాత్రం కలగదు. ఇటువంటి పొలిటికల్, ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకులకు విసుగు రాకుండా మూడు గంటల పాటు తెరపై నడిపించడం దర్శకుడు సుకుమార్‌కు మాత్రమే సాధ్యం. ఒక్కో పాత్రను సుక్కు డిజైన్ చేసిన తీరు మరో ఎత్తు. ఈ సినిమాతో సుకుమార్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. రెగ్యులర్ సినిమాలను చూసి బోర్ ఫీలయ్యే ప్రేక్షకులకు పుష్ప మంచి రిలీఫ్‌ను ఇస్తుంది.